బాబు ఫుల్ హ్యాపీనా...ఆ కోరిక మోడీ తీరుస్తారా?
అంటే ఏపీకి వెంటనే ఈ రుణభారం లేకుండా వీలైనంత కాలం వాయిదా వేసినట్లు అయితే ఆ రుణాలకు వడ్డీలు కట్టే బాధ తప్పుతుంది.
ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీ టూర్ చేసారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో ఏకంగా గంట పాటు భేటీ అయ్యారు. ఏపీకి ఏమి కావాలో ఆయన సవివరంగా మోడీకి చెప్పారని అంటున్నారు. ఏపీ అవసరాలు ఇబ్బందులు తక్షణ చేయాల్సిన సాయాలు కూడా బాబు మోడికి తెలియ చెప్పారని అంటున్నారు.
బాబు ఢిల్లీ టూర్ లో ఏపీని నిధులు కావాలని సహజంగానే అడిగినట్లు సమాచారం. అయితే దానితో పాటు గత ప్రభుత్వం చేసిన పది లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టలేక ఏపీ నడ్డి విరుగుతోందని బాబు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకుని వచ్చారని అంటున్నారు. ఆ రుణాలను రీ షెడ్యూల్ చేయమని బాబు ప్రధాన డిమాండ్ ముందు పెట్టారని అంటున్నారు.
అంటే ఏపీకి వెంటనే ఈ రుణభారం లేకుండా వీలైనంత కాలం వాయిదా వేసినట్లు అయితే ఆ రుణాలకు వడ్డీలు కట్టే బాధ తప్పుతుంది. అలా బడ్జెట్ లో ఏకంగా యాభై వేల కోట్ల దాకా నిధులు మిగులుతాయి. దాంతో ఏపీలో సంక్షేమ పధకాలు ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు అన్నది బాబు ఉద్దేశ్యం అని అంటున్నారు.
దాంతో చంద్రబాబు ఈ కోరికను కేంద్రం ముందు ఉంచారని అంటున్నారు. అయితే ఏపీకి ఉన్న పది లక్షల కోట్ల అప్పులలో వైసీపీ చేసినవి ఆరేడు లక్షల దాకా ఉంటే అంతకు ముందు చంద్రబాబు పాలనలో చేసినవి మూడు లక్షల కోట్లు ఉన్నాయి. అంటే వాటి కాలపరిమితి కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
పాత రుణాలను రీ షెడ్యూల్ చేస్తారా లేక కొత్త రుణాలను చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అంతే కాదు మొత్తం పది లక్షల కోట్ల రూపాయల రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ఎంత వరకూ వీలు ఉంటుందో కూడా చూడాలని అంటున్నారు. రుణాల రీ షెడ్యూల్ చేయడం అంటే స్పెషల్ కేసు గానే ఏపీని చూడాలని అంటున్నారు.
మరి దీనిని ఆర్బీఐ నిబంధనలు ఎంతవరకు సహకరిస్తాయో చూడాలని అంటున్నారు. సహజంగా రైతు రుణాలు ఇతర రుణాల విషయంలో రీషెడ్యూలింగ్ ఉంటుంది. అలాగే ఒక రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్నపుడు కూడా రీ షెడ్యూలింగ్ చేయవచ్చు. ఏపీ విషయానికి వస్తే బడ్జెట్ ఏటా దాదాపుగా రెండు లక్షల కోట్లు ఉంటుంది.
ఆ విధంగా ఏపీని ఆర్ధికంగా బలంగా ఉన్న స్టేట్ గానే చూస్తారు. ఏపీలో గడచిన పదేళ్ళ కాలంలో ఉత్పాదక రంగాలకు పెట్టే ఖర్చు తగ్గి అనుత్పాదక రంగాలకు పెట్టడంతోనే రాబడి ఎంత వచ్చినా అప్పులు చేయాల్సి వస్తోంది. అదే సమయంలో వడ్డీలకు కూడా కట్టాల్సి వస్తోంది అని అంటున్నారు. ఇది ఉచిత హామీల వల్ల రాజకీయపరమైన ప్రయోజనాల కోసం చేసిన దాని వల్ల ఏర్పడిన దుస్థితి. కూర్చుని తింటే కొండలు అయినా తరిగిపోతాయని ఒక సామెత ఉంది. అలాగే అప్పు చేసి పప్పు కూడు అని మరో సామెత ఉంది.
ఏపీ విషయంలో చూస్తే కనుక ఈ రెండూ సరిపోతాయని అంటున్నారు. ఇంకో వైపు నుంచి ఆలోచిస్తే కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తే రుణాల రీ షెడ్యూల్ చేయడం కష్టమేమీ కాదని అంటున్నారు. అయితే మొత్తానికి మొత్తంగా చేయడం కుదురుతుందా అన్నది ఒక ఆలోచన. అదే సమయంలో ఒక్కో అప్పుకూ ఒక్కో కాలపరిమితితో రుణాలు ఎంత వీలైతే అంత వడ్డీ అన్నట్లుగా తెచ్చారు. దాంతో దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేసి కేంద్రం నిర్ణయం తీసుకుంటుదని అంటున్నారు.
మరి రుణాల రీ షెడ్యూల్ కనుక చేస్తే ఏపీకి ఒక విధంగా యాభై వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నట్లే అని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ టూర్ లో కేంద్రం వద్ద పెట్టిన డిమాండ్లలో ఇది కూడా ఉందని ప్రచారం సాగుతోంది.
ఇంకో వైపు చూస్తే పోలవరానికి నిధులు ఇవ్వమని కేంద్రాన్ని చంద్రబాబు కోరారని అంటున్నారు. నష్ట పరిహారం ప్యాకేజీతో కలుపుకుని సవరించిన అంచనాలు అంటే ఇప్పటికి ఇచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయలు తోడు మరో నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంత సొమ్ము కేంద్రం ఇవ్వడానికి ఒప్పుకుంటే మాత్రం పోలవరం పూర్తి అయినట్లే. చంద్రబాబు కూడా గ్రేట్ అని ఒప్పుకోవాల్సిందే.