ప్రశాంత్ కిశోర్ మీద కేసు పెడతారా...!?
అదే విధంగా తీసుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వం లో కేసులు ఎటూ ఎక్కువగా పెడతారు అన్న ప్రచారం ఉంది కాబట్టి ఐ ప్యాక్ టీం తో పాటు ప్రశాంత్ కిశోర్ మీద కూడా కేసులు పెడతారు అని అంటున్నారు.
ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఇపుడు వైసీపీకి విలన్ అయిపోయారు. ఆయన తాజాగా ఒక రాజకీయ జోస్యం వదిలారు. ఏపీలో వైసీపీ మళ్లీ గెలవదు అని జోస్యం చెప్పారు. ఆ జోస్యం మీద వైసీపీ నేతలు అంతా కలసి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఒక పీకే అంటే పవన్ కళ్యాణ్ పక్కకు వెళ్లి మరో పీకే ప్రశాంత్ కిశోర్ వచ్చారు అని ఘాటైన విమర్శలు చేశారు.
ఈసారి వైసీపీ భారీ ఓటమిని కొని తెచ్చుకుంటుందని ప్రశాంత్ కిశోర్ అంటే వైసీపీకి మంటెక్కిపోయింది అని అంటున్నారు. ఈ నపధ్యంలో కావాలనే పీకే డ్యామేజ్ చేశారు అని అంటున్నారు. వైసీపీ గెలుస్తుంది అన్న ముద్ర నుంచి పీకే తప్పించి జనాలకు కొత్త ఆలోచనలు వచ్చేలా చేసారు అని కూడా అంటున్నారు. దాంతో పైకి పీకే విమర్శలను ఖండించినా లోలోపల మాత్రం పార్టీ వర్గాలు అంతర్మధనం చేస్తున్నాయని అంటున్నారు.
దీని మీద వైసీపీ పార్టీ లోపల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది అని అంటున్నారు. అధినేత జగన్ తన పార్టీ వారితో కలసి ఈ అంశం మీద ప్రశాంత్ కిశోర్ జోస్యం మీద అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. ఇక చూస్తే వైసీపీకి ఐ ప్యాక్ సంస్థ సర్వేలు అందిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ఉంటోంది.
ఈ ఐప్యాక్ కూడా ప్రశాంత్ కిశోర్ కి సంబంధించిందే. అయితే ఇపుడు వేరు పడ్డారు అని అంటున్నారు. దాంతో అందులో ఉన్న వారితో ప్రశాంత్ కిశోర్ కి మంచి పరిచయాలు ఉన్నాయని బహుశా ఐ ప్యాక్ టీం నుంచి ఏమైనా సీక్రెట్స్ లీక్ అయ్యాయా ఏ సాధికారికతతో ప్రశాంత్ కిశోర్ ఈ విధంగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది కూడా ప్రతి పక్ష పార్టీ లో చర్చ సాగుతోంది అలానే సోషల్ మీడియా లో టీడీపీ జనసేన వారు చర్చ చేస్తున్నారు.
ఒక వేళ ఐ ప్యాక్ టీం నుంచే ప్రశాంత్ కిశోర్ కి సర్వే వివరాలు ఏమైనా లీక్ అయి ఉంటే మాత్రం వారి మీద కూడా కేసులు పెట్టడానికి వైసీపీ పెద్దలు ఏ మాత్రం వెనకాడబోరు అని ప్రతి పక్షాలకు సంబందించిన వారు వెటకారం చేస్తున్నారు. అదే విధంగా తీసుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వం లో కేసులు ఎటూ ఎక్కువగా పెడతారు అన్న ప్రచారం ఉంది కాబట్టి ఐ ప్యాక్ టీం తో పాటు ప్రశాంత్ కిశోర్ మీద కూడా కేసులు పెడతారు అని అంటున్నారు.
ఈ రకంగా చూస్తే కనుక ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున పార్టీ లోపల సాగుతోంది అని అంటున్నారు. ఇక చూస్తే పీకే మీద కేసులు పెడతారా లేక ఐ ప్యాక్ మీద యాక్షన్ ఉంటుందా అన్నది తెలియదు కానీ టీడీపీ జనసేన క్యాడర్ సోషల్ మీడియాలో మాత్రం దీని మీద పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ వైసెపీని ట్రోలింగ్ చేస్తున్నాయి. అంతే కాదు సెటైర్లు కూడా పేలుస్తున్నాయి.
ఇక ఇవన్నీ పక్కన పెడితే పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ కి ఉన్న ఇమేజ్ ఎంత ఆయన ప్రభావం ఎంత అన్న దాని మీద చర్చ సాగుతోంది. ఆయన గత ఎన్నికల్లో వైసీపీకి స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు. ఆయన సలహా సూచనలు పాటించి వైసీపీ అధికారంలోకి వచ్చింది అని చాలా మంది నమ్ముతారు. 2019లో వైసీపీ గెలవడానికి అనేక కారణాలు ఉన్నా పీకే ప్రభావం ఉందని నమ్మే వారు ఉన్నారు.
అయితే నాటికీ నేటికీ అయిదేళ్ల కాలం గడచిపోయింది. ఇపుడు పీకే ఇమేజ్ అయితే పెద్దగా ఉండదు అని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ ముల్లుని ముల్లుతోనే కోయాలి అన్న నీతిని టీడీపీ అమలు చేస్తోంది. పీకే నాడు జగన్ కి హెల్ప్ చేశారు అని అదే పీకేని ప్రత్యర్థిగా చేసి జనంలో ఆయన చేతనే జగన్ మీద విమర్శలు చేయిస్తే వర్కౌట్ అవుతుందని టీడీపీ భావిస్తోంది.
మొత్తం మీద చాలా సర్వేలు వస్తున్నాయి. జోస్యాలు కూడా వస్తున్నాయి. కానీ ఏపీ ఎన్నికల మీద పీకే చెప్పిన మాటలు ఆయన వదిలిన జోస్యాలలో నిజాల సంగతి పక్కన పెడితే జనాలలో ఆసక్తిని మాత్రం పెంచాయని అంటున్నారు. సో. ఇది వైసీపీకి కొంత ఇబ్బందిగా ఉండవచ్చు అన్నదే ప్రచారంలో ఉన్న మాట.