రోడ్డు వేయాలంటే పొలాల్ని డిస్ట్రబ్ చేయక్కర్లేదు.. ఈ ఫోటోనే సాక్ష్యం

రోడ్డు వేయాలంటే వందలాది ఎకరాల భూమిని సేకరించటం.. ఈ క్రమంలో వారికి జరిగే నష్టం.. కష్టం అంతా ఇంతా కాదు.

Update: 2025-01-27 07:30 GMT

రోడ్డు వేయాలంటే వందలాది ఎకరాల భూమిని సేకరించటం.. ఈ క్రమంలో వారికి జరిగే నష్టం.. కష్టం అంతా ఇంతా కాదు. రోడ్డు వేసేందుకు వ్యవసాయ భూమిని డిస్ట్రబ్ చేయకుండా నిర్మించటం సాధ్యమా? అని ప్రశ్నిస్తే.. మన అధికారులు కానీ.. పాలకులు కానీ నో అంటే నో అనేస్తారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందన్న దానికి నిదర్శనంగా చైనా పాలకులు చేపట్టిన ఈ తరహా పనుల్ని మనం ఎందుకు చేయలేం? అన్నది ప్రశ్న.

ఈ ఫోటోను చూసిన తర్వాతైనా.. మన వాళ్ల ఆలోచనల్లో మార్పులు వస్తుందని ఆశిద్దాం. ఒక రోడ్డును వేసేందుకు.. అది కూడా 126 కిలోమీటర్ల పొడవున రోడ్డు అంటే మాటలు కాదు. ఒకవేళ మనదగ్గరే ఇలాంటి ప్రాజెక్టే చేపడితే వేలాది ఎకరాల భూమిని సేకరించేస్తుంటారు. అందుకు భిన్నంగా చైనా పాలకులు చేపట్టిన ఒక ప్రాజెక్టు గురించి తెలిస్తే.. ఇలా కూడా చేయొచ్చా? అన్న విస్మయానికి గురవుతాం.

అదే సమయంలో.. ప్రాజెక్టుల పేరుతో వందలాది ఎకరాల్ని సేకరించేందుకు పడేందుకు కిందా మీదా పడుతుంటారు. వేలాది మందిని ఆందోళనకు గురి చేసే తీరుకు భిన్నంగా చేపట్టిన ప్రాజెక్టు కొత్త ఆలోచనలకు తెర తీస్తుందని చెప్పాలి. హుబే ప్రావిన్స్ లోని 126 కిలోమీటర్ల పొడవైన వుహాన్ - యాంగ్ షీన్ హైవేను నిర్మించారు.

దీని కోసం ఎలాంటి వ్యవసాయ భూముల్ని తీసుకోకుండానే అంత భారీ రహదారిని నిర్మించిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇంత పొడవైన రహదారి వెంట చెరువులు.. పంట పొలాలు ఉన్నాయి. అయితే.. పంటలకు ఇబ్బంది కలగకుండా ఎత్తైన స్తంభాలు నిర్మించారు. దీంతో పంట పొలాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రహదారిని నిర్మించటం విశేషం. ఈ హైవేను చూసిన మన పాలకులు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే.. అనవసరమైన సమస్యలకు పరిష్కారం లభించినట్లు అవుతుంది.

Tags:    

Similar News