కోర్టులో యాపిల్ వాచ్ పై వాజ్యం.. తెరపైకి క్యాన్సర్ కారకం!

అవును... వివిధ కంపెనీలకు చెందిన 22 వాచ్ బ్యాండ్ లపై చేసిన ఓ అధ్యయనం ఫలితంగా తాజాగా ఓ వ్యాజ్యం దాఖలైంది.

Update: 2025-01-28 03:00 GMT

యాపిల్ స్మార్ట్ వాచ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని.. ప్రధానంగా హృదయ స్పందన రేటు, నిద్ర, నడక మొదలనటువంటి హెల్త్ సేఫ్టీకి సంబంధించిన అంశాలను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు యూజర్లను అప్రమత్తం చేసే హెల్త్ ట్రాకింగ్ ఉపకరణంగా కూడా ఉపయోగపడుతుందనే మంచి పేరుంది! దీనికి సంబంధించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.

ఇందులో భాగంగా... ఓ మహిళ తాను గర్భవతి అనే విషయాన్ని యాపిల్ వాచ్ ఇచ్చిన కమాండ్స్ ఆధారంగానే తెలుసుకుందని.. ఓ అమ్మాయి ధరించిన యాపిల్ వాచ్ ఆగకుండా బీప్ మని శబ్ధంతో అలర్ట్ చేయడంతో పాటు గుండె వేగం సరిగా లేదని అలర్ట్ చేసిందని.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ చిన్నారికి క్యాన్సర్ అని గుర్తించినట్లు కథనాలొచ్చాయి.

అలాటి యాపిల్ వాచ్ లపై ఫిర్యాదు అందింది. ఆ యాపిల్ అదే వాచ్ విషయంలో ఇప్పుడు వ్యాజ్యాన్ని ఎదుర్కొంటోంది. ఈ యాపిల్ వాచ్ వినియోగదారులను విష రసాయనాలకు గురిచేస్తోందని, క్యాన్సర్ తో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఆ వ్యాజ్యంలో ఆరోపించారు. ఈ విషయం వైరల్ గా మారింది.

అవును... వివిధ కంపెనీలకు చెందిన 22 వాచ్ బ్యాండ్ లపై చేసిన ఓ అధ్యయనం ఫలితంగా తాజాగా ఓ వ్యాజ్యం దాఖలైంది. ఇందులో భాగంగా... 15 వాచ్ బ్యాండ్ ల తయారీకి ఉపయోగించిన పదార్థాల్లో హానికర రసాయనాలు ఉన్నట్లు కనుగొన్నారని పేర్కొన్నారు. వీటిలో యాపిల్ కు చెందిన వాచ్ లు ఉన్నాయి.

వీటిలో యాపిల్ కి చెందిన 'ఓషన్', 'నైక్ స్పోర్ట్స్', రెగ్యులర్ స్పోర్ట్స్ వాచ్ బ్యాండ్ లు అధిక స్థాయిలో ఫెర్ ఫ్లోరో ఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ పదార్థాలను కలిగి ఉన్నాయని ఆ వ్యాజ్యంలో నివేదిక అధ్యనాన్ని ఉదహరించారు. ఈ రసాయనాలు పర్యావరణంలోనూ, మానవ శరీరంలోనూ చాలా ఏళ్లు వాటి దుష్ప్రభావలను కొనసాగిస్తాయని పేర్కొన్నారు.

దీనిపై యాపిల్ స్పందించింది. ఈ సందర్భంగా... తమ వాచ్ బ్యాండ్ లు ఫ్లోరోఎలాస్టోమర్ అనే సింథటిక్ రబ్బరు నుంచి తయరవుతాయని.. ఇది ఫ్లోరిన్ కు కలిగి ఉంటుందే కానీ... హానికరమైన ఫెర్ ఫ్లోరో ఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలను కలిగి ఉండవని వాదిస్తోందని అంటున్నారు. దీంతో... కోర్టులో యాపిల్ వాచ్ లపై వ్యాజ్యం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News