నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి పవన్ మన అందరినీ తాకట్టు పెట్టారు: కేఏ పాల్

ఈ మేరకు సంబంధిత పత్రాలను సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని ఆయన ఆదేశించారు.;

Update: 2025-03-05 17:30 GMT

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ పదవి కేటాయించినట్లు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని ఆయన ఆదేశించారు.

ఈ పరిణామంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీని ప్రజల కోసం, న్యాయపరమైన పోరాటాల కోసం నెలకొల్పినట్లు చెబుతున్నా, వాస్తవంగా అది అవినీతిపరమైన కుటుంబ రాజకీయాలకు మార్గం సుగమం చేస్తున్నదని ఆయన విమర్శించారు.

"21 మంది ఎమ్మెల్యేలకు 1 ఎమ్మెల్సీ సీటు వస్తే, లక్షల మంది పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఆ అవకాశం ఇవ్వకుండా, కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వారికి ఇవ్వలేదు. జనసైనికులు ఇప్పటికైనా కుటుంబ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రజా శాంతి పార్టీలో చేరండి?" అని కే.ఏ.పాల్ విమర్శించారు.. ఇది పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలను మాత్రమే ప్రోత్సహించే పార్టీ అని ఇప్పటికే తాను హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో ఉంటున్న నటుడిని తీసుకురావడం ద్వారా పార్టీ కార్యకర్తల శ్రమను తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కే.ఏ.పాల్, జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా కుటుంబ పార్టీకి గుడ్‌బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు.

Tags:    

Similar News