మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక సాక్షి వాచ్‌మెన్‌ రంగన్న మృతి

ఈ రోజు మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పోలీసులు రంగన్నను ఆసుపత్రికి తరలించారు.;

Update: 2025-03-05 14:25 GMT

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్‌మెన్‌ రంగన్న మృతి చెందారు. కడప రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన కన్నుమూశారు. 85 ఏళ్ల రంగన్న వయసు రీత్యా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పోలీసులు రంగన్నను ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

- వివేకానందరెడ్డి హత్య కేసులో రంగన్న పాత్ర

2019 మార్చి 15న పులివెందులలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అప్పట్లో వివేకా నివాసంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రంగన్న ఈ హత్య కేసులో కీలకంగా మారారు. సీబీఐ విచారణలో రంగన్న ఇచ్చిన వాంగ్మూలాలు రికార్డ్ అయ్యి ఉన్నాయి. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో రంగన్న పేరు ప్రముఖంగా ప్రస్తావించారు.

కేసు దర్యాప్తు ప్రస్తుతం వేగంగా సాగుతుండగా రంగన్న అనారోగ్యంతో మరణించడంతో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుందన్నది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News