దారుణం... శానిటరీ ప్యాడ్ అడిగిన అమ్మాయికి ప్రిన్సిపల్ శిక్ష!
ఈ సమయంలో సదరు విద్యార్థిని పరిస్థితి అర్ధం చేసుకోవాల్సిన ప్రిన్సిపల్.. ఆమె అవసరాన్ని తీర్చలేదు సరికదా.. తరగతి గది బయట సుమారు గంట పాటు నిలబడేల చేశాడని అంటున్నారు.
కొంతమంది జనాలు తాము చాలా పెద్ద మనుషులమని చెప్పుకుంటారు.. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటారు.. కానీ ఇంగిత జ్ఞానం లోపించి ప్రవర్తిస్తుంటారు! వారి మూర్ఖత్వం వల్ల ఇతరులను చాలా ఇబ్బంది పెడుతుంటారు! ఈ క్రమంలో.. ఓ పాఠశాలలో పరీక్ష సమయంలో శానిటరీ ప్యాడ్ అడిగిన అమ్మాయి విషయంలో ఇంగితం విడిచి ప్రవర్తించారని అంటున్నారు.
అవును.. బాలికల పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన పరీక్ష సమయంలో శానిటరీ ప్యాడ్ ను అభ్యర్థించింది. ఈ సమయంలో సదరు విద్యార్థిని పరిస్థితి అర్ధం చేసుకోవాల్సిన ప్రిన్సిపల్.. ఆమె అవసరాన్ని తీర్చలేదు సరికదా.. తరగతి గది బయట సుమారు గంట పాటు నిలబడేల చేశాడని అంటున్నారు.
దీంతో... తనకు స్కూల్లో జరిగిన పరిస్థితిని సదరు అమ్మాయి తన తల్లితండ్రులకు చెప్పుకుని బాధపడింది. దీంతో.. ఆ బాలిక తండ్రి ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా... తన కుమార్తె పరీక్ష సమయంలో ఋతుస్రావం ప్రారంభమైందని తెలుసుకుని ప్రిన్సిపాల్ నుంచి శానిటరీ ప్యాడ్ కోసం అభ్యర్థించిందని తెలిపారు.
అయితే.. ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు సరికదా.. ఆమెను తరగతి గది నుంచి బయటకు పంపించి.. సుమారు గంటపాటు బయట నిలబడేలా చేశారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.