జగన్ తప్ప.. ఓటమి దిశగా మంత్రులు !
మిగిలిన మంత్రులు, మాజీమంత్రు లు కూడా ఓటమి దిశగా దూసుకువెళ్తున్నారు
ఏపీలో జాతీయ మీడియా సంస్థలు చెప్పినట్టే.. జరుగుతోంది. వైసీపీ సత్తా చాటలేక పోయింది.. తొలి రౌండ్ నుంచి కూడా... ఎక్కడా పోటీ ఇవ్వలేక పోయింది. కూటమి పార్టీలు ఏకపక్షంగా దూకుడు ప్రదర్శిస్తున్నా యి. మరీ ముఖ్యంగా కేబినెట్‌లోని మంత్రులు గుండుగుత్తగా ఓడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సీఎం జగన్ పులివెందులలో మాత్రం.. కొంత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మిగిలిన మంత్రులు, మాజీమంత్రు లు కూడా ఓటమి దిశగా దూసుకువెళ్తున్నారు.
ఇప్పటి కే మేజిక్ ఫిగర్ దాటేసిన టీడీపీ కూటమి.. విజయం దక్కించుకునేందుకు దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇక, వైసీపీ 20-24 స్థానాల్లో మాత్రమే ఊగిసలాడుతోంది. ప్రధానంగా మంత్రులు, మాజీ మం త్రులు.. ఓటమి దిశగా అడుగులు వేయడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యంగా మంత్రులు తమకు ఏమీ చేయలేదన్న పరిస్థితిని పప్రజలు తమ ఈవీఎంలలో స్పష్టంగా చూపించారు.. దీంతో మంత్రులు అందరూ వారు వీరు అని తేడాలేకుండా.. ఓటమి దిశగా ఉన్నారు.
కీలక మంత్రులు.. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్జన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పాముల పుష్ప శ్రీవాణి... మేకతోటి సుచరిత, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాస్ కూడా.. ఓటమి బాటలో ఉన్నారు. ఇక, స్పీకర్.. తమ్మినేని సీతారాం కూడా.. ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక, బలమైన నాయకుడుగా.. ఫైర్ బ్రాండ్ అయిన కోడాలి నాని గుడివాడలో ఓటమి బాటలో ఉన్నారు.
ఇక, గన్నవరంలో కూడా వైసీపీ ఓటమి దిశగా అడుగులు వేసింది. వల్లభనేని వంశీ ఓటమి దిశాగా దూసుకుపోతున్నారు. అదేవిధంగా విజయవాడ సెంట్రల్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. కూడా ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా.. మొత్తంగా మంత్రులు మొత్తంగా ఓటమి బాట పట్టారు. అయితే.. కడపటి వార్తలు అందే సరికి.. 5 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి.