అసెంబ్లీలో బ్యాక్ బెంచేనా...జగన్ ఏమి చేస్తారు ?

దాంతో ప్రధాన ప్రతిపక్షానికి ఇచ్చేలా మొదటి వరసలో సీట్లు ఇవ్వరని అంటున్నారు. ఇక జగన్ ని సైతం సాధారణ సభ్యుడిగానే చూస్తారు అని అంటున్నారు.

Update: 2024-07-22 00:30 GMT

ఏపీ అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ కి బ్యాక్ బెంచ్ నే కేటాయిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా అసెంబ్లీ స్పీకర్ సీట్ల కేటాయింపు జరపలేదని అంటున్నారు. పైగా ప్రధాన ప్రతిపక్షం అన్నది ఈసారి అసెంబ్లీలో నోటిఫై చేయరని అంటున్నారు.

ప్రధాని ప్రతిపక్ష హోదా ఇవ్వాలీ అంటే మొత్తం శాసనసభలో 10 శాతం సీట్లు తెచ్చుకోవాలని నిబంధన ఉందని చెబుతున్నారు. ఆ లెక్కన 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. వైసీపీకి దక్కినవి 11 సీట్లు మాత్రమే. దాంతో వైసీపీని ఒక శాసనసభా పక్షంగానే చూస్తారు అని అంటున్నారు.

దాంతో ప్రధాన ప్రతిపక్షానికి ఇచ్చేలా మొదటి వరసలో సీట్లు ఇవ్వరని అంటున్నారు. ఇక జగన్ ని సైతం సాధారణ సభ్యుడిగానే చూస్తారు అని అంటున్నారు. అంటే వెనక వరసలోనే ఆయనతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చోవాల్సి ఉంటుందని అంటున్నారు.

మరో వైపు చూస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉంది కాబట్టి అపొజిషన్ గా గుర్తించాలని జగన్ స్పీకర్ కి లేఖ రాశారు అయితే దాని మీద స్పీకర్ ఏమి నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ ఇప్పటిదాకా సీట్ల కేటాయింపు జరపలేదు అంటే కనుక వైసీపీకి ఆ గుర్తింపు లేనే లేదని అంటున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం నుంచి ఏపీ శాసన సభ బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ సమావేశాలలో వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నది చర్చగా ఉంది. అయితే తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి సీట్ల కేటాయింపు సమస్య ఉండదు. ఆ తరువాత జరిగే సమావేశాలలో సీట్ల సమస్య వస్తుంది.

అంటే రెండో రోజు నుంచే అన్న మాట. ఇక తొలి రోజే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుతుంది. సాధారణంగా ఈ సమావేశానికి విపక్షాన్ని కూడా పిలుసారు. అయితే విపక్షాన్ని నోటిఫై చేయకపోవడం వల్ల వైసీపీకి ఆహ్వానం ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.

మొత్తం మీద చూస్తే వైసీపీకి ఈ రకమైన సమస్య ఎపుడూ ఎదురు కాలేదు. ఈసారి మాత్రం ఆ విధంగా సిట్యువేషన్ ఉంది. మరి దీనిని ఎలా అధిగమించి వైసీపీ సభకు హాజరవుతుంది అన్నది చూడాలి. ఒక వేళ సభకు హాజరు కాకపోతే జనంలో కూడా విమర్శలు వస్తాయి.

ఇంకో వైపు చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా ప్రోటో కాల్ ప్రకారం గుర్తించకపోయినా సభలో ఉన్న ఓఅక ఒక ప్రతిపక్షం కాబట్టి వారికి ఆ ప్రాధాన్యత ఇవ్వవచ్చు అని అంటున్నారు. అంతే కాదు బీఏసీ మీటింగ్ కి సైతం పిలవవచ్చు అని అంటున్నారు. మరి స్పీకర్ ఏమి ఆలోచిస్తారు అన్నది చూడాలి. దాని కంటే ముందు వైసీపీ ఏ విధంగా వ్యవహరించాలని అనుకుంటోంది అన్నది కూడా చూడాల్సి ఉంది.

Tags:    

Similar News