ఊరిస్తున్న ఐదు ఎమ్మెల్సీ ఖాళీలు
ఏపీలో వైసీపీ ఓటమి పాలు అయి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇది అయిదవ రాజీనామా గా చూడాలి.;
వైసీపీ నుంచి మరో వికెట్ అవుట్ అయింది. వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ తన ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి రాజీనామా చేసి షాక్ తినిపించారు. దీంతో శాసన మండలిలో వైసీపీ నుంచి రాజీనామాలు అయిదుకు చేరుకున్నాయి.
ఏపీలో వైసీపీ ఓటమి పాలు అయి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇది అయిదవ రాజీనామా గా చూడాలి. మొదట పోతుల సునీత రాజీనామా చేశారు. ఆ తరువాత కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకట రమణ వరసగా రాజీనామాలు చేశారు. ఇపుడు మర్రి రాజశేఖర్ వంతు వచ్చింది. ఆయన రాజీనామాతో పాంచ్ పటాకా పేలింది.
ఇదిలా ఉంటే మొదట రాజీనామా చేసిన వారి రాజీనామాలే ఆమోదం కాలేదు. చైర్మన్ పరిశీలన కోసం అక్కడే ఉన్నాయి. దాంతో చాలా కాలం క్రితమే ఖాళీ అయి ఈ సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా చైర్మన్ నిర్ణయం కోసం ఆగిపోయాయి. చైర్మన్ విచక్షణతను ఎవరూ ప్రశ్నించజాలరు.
అందువల్ల ఆయన తన వద్దకు వచ్చిన రాజీనామాలను ఆమోదించలేదు దానికి ఒక నిర్దిష్ట కాల పరిమితి అయితే లేదు. దాంతోనే వైసీపీ ఊపిరి పీల్చుకుంటోంది. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన నాటికి శాసన మండలిలో వైసీపీ బలం మొత్తం 58 మంది సభ్యులు ఉండే కౌన్సిల్ లో 38గా ఉండేది. ఇపుడు చూస్తే అది కాస్తా 33కి పడిపోయింది. అయినా సరే ఈ రోజుకీ వైసీపీదే మెజారిటీగా ఉంది.
మరో వైపు కూటమి బలం 15 పై దాటింది. వైసీపీ నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల పదవులు ఖాళీ అయితే అవన్నీ గుత్తమొత్తంగా కూటమి ఖాతాలోకి వెళ్తాయని అంటున్నారు. దాంతో కూటమి వైపు నుంచి ఉన్న ఆశావహులకు ఈ పదవులు ఊరిస్తున్నాయని అంటున్నారు. వైసీపీలో ఉండమని చెబుతూ ఎమ్మెల్సీ పదవులను వదులుకుంటున్నారు. ఆ మీదట వారు కౌన్సిల్ కి కూడా వెళ్లడం లేదు. అయితే వారి రాజీనామాలు ఆమోదం పొందనంతవరకూ వారంతా వైసీపీ వారి కిందకే లెక్క.
ఈ టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. చైర్మన్ వారి రాజీనామాలు ఎపుడు ఆమోదిస్తారు అన్నది ఆయన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఖాళీలు ఏర్పడితే ఆ పదవులను చేపట్టాలని కూటమిలోని చాలా మంది చూస్తున్నారు మరో వైపు వైసీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చీ వారు తిరిగి కూటమి పార్టీల్లో చేరి తమ ఎమ్మెల్సీ పదవులు ఆ పార్టీ ఖాతాల నుంచి అందుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు
ఏది జరగాలన్నా కూడా రాజీనామాలు ఆమోదం పొందడం అన్నది తప్పనిసరి. అది ఎపుడు జరుగుతుంది అంటే ఎవరూ చెప్పలేరు. ఇంకో వైపు ఊస్తే ఈ రాజీనామాలు ఆమోదం పొందడమే తరువాయి మరింత మంది రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ వైపు నుంచి కూటమి వైపుగా పరుగులు పెడుతున్న వారి విషయంలో కలవరపడుతున్నా వైసీపీ ఏమీ చేయలేకపోతోంది అని అంటున్నారు.