47 వేల బూత్ కమిటీలతో వైసీపీ సిద్ధం...!

సిద్ధం అన్న ఒక్క మాట పవర్ ఫుల్ డైలాగ్ గా వైసీపీ వాడడంలేదు. నిజంగానే యుద్ధానికి ఫుల్ ప్రిపేర్డ్ గా ఉంది అని అంటున్నారు.

Update: 2024-02-23 04:03 GMT

సిద్ధం అన్న ఒక్క మాట పవర్ ఫుల్ డైలాగ్ గా వైసీపీ వాడడంలేదు. నిజంగానే యుద్ధానికి ఫుల్ ప్రిపేర్డ్ గా ఉంది అని అంటున్నారు. ఒక వైపు అభ్యర్ధులను ఎంపిక చేస్తూనే మరో వైపు సిద్ధం పేరుతో రీజనల్ స్థాయిలో సభలను నిర్వహిస్తూనే ఇంకో వైపు పోల్ మేనేజ్మెంట్ విషయంలోనూ అందరి కంటే ముందే ఉంది. వైసీపీ వార్ రూం ఇప్పటికే సిద్ధం చేసేసింది.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఏపీ వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రతీ పోలింగ్ బూత్ లెవెల్ లో పదిహేను మంది మెంబర్స్ తో వైసీపీ బూత్ లెవెల్ కమితీలని ఏర్పాటు చేసుకుని సమరానికి సై అంటోంది. ఏపీ వ్యాప్తంగా చూస్తే 47 వేల బూత్ లెవెల్ కమిటీలను వైసీపీ ఏర్పాటు చేసింది.

ఒక్కో కమిటీలో ఉన్న పదిహేను మంది మెంబర్స్ లో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారూ ఉన్నారు. అలాగే మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. వీరంతా ఆ పోలింగ్ బూత్ పరిధిలో ప్రతీ ఇంటికీ వెళ్ళి వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు వివరిస్తున్నారు. వీరంతా పోల్ మేనేజ్మెంట్ లో కూడా శిక్షణ పొందుతున్నారు.

ఎన్నికల వేళకు ప్రతీ ఇంటికి వెళ్ళి ఆయా కుటుంబాలను వైసీపీ ద్వారా పధకాలు అందుకుంటూ లబ్ది పొందిన వారిని పోలింగ్ బూతులకు తీసుకుని వచ్చి వైసీపీకి అనుకూలంగా ఓటు వేసేలా చేయడమే కమిటీ మెంబర్ల అసలైన విధి. స్థానికంగా ఉంటే ఈ పదిహేను మంది బూత్ కమిటీ మెంబర్స్ ప్రతీ కుటుంబంతో మమేకం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

అదే విధంగా వీరితోనే ఎన్నికల ప్రచారాన్ని కూడా బూత్ లెవెల్ దాకా నిర్వహించాలని కూడా పార్టీ నిర్ణయించింది. ఇలా పదిహేను మందితో నియమించిన ప్రతీ బూత్ కమిటీది కీలకమైన పాత్ర అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో వీరే అసలైన యుద్ధం చేస్తారు అని అంటున్నారు.

ఇలా పోలింగ్ బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటుతో పాటు ఎన్నికల నిర్వహణ, పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఒక యాక్షన్ ప్లాన్ ని కూడా వైసీపీ రెడీ చేసిందని అంటున్నారు. ఈ బూత్ లెవెల్ కమిటీలు జిల్లా స్థాయిలో వైసీపీ పార్టీతో అనుసంధానం అవుతాయని అక్కడ నుంచి వచ్చే ప్రతీ సమాచారం జిల్లాకు ఆ మీదట స్టేట్ లెవెల్ కి ఎప్పటికపుడు చేరవేయడం జరుగుతుంది అని అంటున్నారు.

ఇక పోలింగ్ రోజుల జరిగే పరిణామాలు, రాష్ట్ర నియోజకవర్గ స్థాయి పరిస్థితుల పైన ఎప్పటికపుడు పరిస్థితులు సమీక్షిస్తూ తగిన సలహా సూచనలతో ఆదేశాలు ఇవ్వడం దిశా నిర్దేశం చేయడానికి స్టేట్ లెవెల్ లో ఒక వార్ రూం ని ఏర్పాటు చేసింది వైసీపీ. అందులో సీనియర్లను నియమించారు. వారు మొత్తం బూత్ లెవెల్ నుంచి వచ్చే ప్రతీ సమాచారాన్ని మధింపు చేసి క్రోడీకరిస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే గ్రౌండ్ లెవెల్ దాకా కూడా వైసీపీ సిద్ధం అయిపోయింది అని అంటున్నారు.

Tags:    

Similar News