క్వీన్ కోరిక తీర్చిన ప్రపంచ కుబేరుడు

మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తన భార్య మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఆమె కోరిన డిస్కోపార్టీని ఏర్పాటు చేశారు

Update: 2024-10-23 05:08 GMT

మనసుకు నచ్చిన నెచ్చిలి అడగాలే కానీ కాదనే వాడు ఎవరుంటారు? అందునా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వ్యక్తిని.. ఆమె సహచరి కోరిక కోరితే ఏం చేస్తారు? తాజాగా అదే జరిగింది. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తన భార్య మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఆమె కోరిన డిస్కోపార్టీని ఏర్పాటు చేశారు. అంతేనా.. నాటి మ్యూజిక్ కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ అదరగొట్టారు. తాము గడిపిన సరదా క్షణాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బిజినెస్ టైకూన్ లాంటి మాటలకు ఇచ్చే బిల్డప్ కు భిన్నంగా జుకర్ బర్గ్ శైలి ఉంటుంది.

తానో కుబేరుడ్ని అన్న విషయాన్ని పట్టించుకోకుండా డిస్కో పార్టీకి పార్టీ వేర్ ప్యాంట్.. షర్ట్ కు జతగా సీక్విన్ జాకెట్ లో జుకర్ బర్గ్ రాగా.. ఆయన సతీమణి చాన్ మాత్రం బంగారువర్ణంలోని దుస్తులతో మెరిసిపోయింది. అదరగొట్టే మ్యూజిక్ కు తగ్గట్లు డ్యాన్సులు.. మధురమైన ముద్దులతో పాటు రొమాంటిక్ ఫోటోలకు ఫోజులు ఇచ్చేశారు. తమ పార్టీ ముచ్చట్లను.. ఫోటోలను షేర్ చేశారు.

ఈ సందర్భాన్ని ‘డిస్కో క్వీన్ పార్టీ అడిగింది’ అంటూ క్యాప్షన్ పెట్టి ఫోటోల్ని షేర్ చేసిన జుకర్ బర్గ్ పోస్టుకు పెద్ద ఎత్తున నెటిజన్లు రియాక్టు అవుతున్నారు. కాలేజీ రోజుల్లో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించటం.. 2003లో డేటింగ్ షురూ చేసిన ఈ జంట 2012లో పెళ్లి చేసుకోవటంలో ఒక్కటి కావటం తెలిసిందే. వీరిద్దరికి ముగ్గురు సంతానం. ఈ మధ్యనే వెలువడిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకోవటమే కాదు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ను అధిగమించటం తెలిసిందే. అతగాడి సంపద 206 బిలియన్ డాలర్లుగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.

Tags:    

Similar News