రిజర్వుడు నియోజకవర్గాలే టార్గెట్టా ?

మొత్తం 119 నియోజకవర్గాల్లోను ప్రతి సెగ్మెంట్లో కచ్చితంగా ఒక బహిరంగసభ నిర్వహించాలన్నది బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్నది.

Update: 2023-07-14 06:15 GMT

ఈనెలాఖరు లోపు 31 నియోజకవర్గాల్లో ఒక్కో మీటింగు పెట్టుకోవాల ని తెలంగాణా బీజేపీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నది. ఈనెల లో ఉన్నది 18 రోజులు. అయినా సరే 31 నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించాలన్నది కమలనాదుల టార్గెట్. ఇందుకు గాను మొదటి రిజర్వుడు నియోజకవర్గాల్లోనే సభలు జరపాల ని అనుకున్నారు. తెలంగాణా లో 19 ఎస్సీ రిజర్వుడు 12 ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. అంటే రెండు కలిపి మొత్తం నియోజకవర్గాల్లో నాలుగో వంతున్నాయి. 119 నియోజకవర్గాల్లో రిజర్వుడు నియోజకవర్గాలే 31 ఉన్నాయంటే చిన్న విషయం కాదు.

మొత్తం 119 నియోజకవర్గాల్లోను ప్రతి సెగ్మెంట్లో కచ్చితంగా ఒక బహిరంగసభ నిర్వహించాలన్నది బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్నది. నియోజకవర్గాల్లో చిన్నపాటి బహిరంగసభలు నిర్వహించటం ద్వారా ఎక్కడికక్కడ జనాల ను ఆకట్టుకోవచ్చన్నది బీజేపీ నేతల ఆలోచన.

దీనికి ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నారు కానీ పార్టీ లోని అంతర్గత వ్యవహారాల వల్ల సాధ్యంకాలేదు. మొత్తానికి పార్టీకి అధ్యక్షుడిగా బండి సంజయ్ స్ధానం లో కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి బహిరంగసభల టార్గెట్ మళ్ళీ ముందుకొచ్చింది.

ఈ నెలాఖరు లోగా 31 బహిరంగసభలు నిర్వహించబోతున్నది. కొత్తగా బాధ్యతలు తీసుకున్న అధ్యక్షుడు కిషన్ రెడ్డి అమెరికా పర్యటన లో ఉన్నపుడే బహిరంగసభలు మొదలైపోతున్నాయి. ముందుగా రిజర్వుడు నియోజకవర్గాల పైనే బీజేపీ ఎందుకని టార్గెట్ పెట్టుకున్నది.

ఎందుకంటే బీజేపీకి మద్దతుగా రిజర్వుడు వర్గాలు పెద్దగా మొగ్గుచూపటంలేదు. మొదటినుండి కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలు పార్టీకి దూరమే. ఈ వర్గాల ను దగ్గర కు తీసుకుని ఆదరణ పెంచుకుంటే తప్ప లాభంలేదని పార్టీ అగ్రనేతలు డిసైడ్ అయ్యారు.

అందుకనే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల పైన ముందుగా దృష్టిపెట్టింది. ఇప్పటికిప్పుడు దృష్టి పెట్టినంత మాత్రాన పై వర్గాలు బీజేపీ వైపు వచ్చేస్తారని అనుకోవటంలేదు. కాకపోతే ఇపుడు ప్లాన్ చేస్తే కనీసం తర్వాత రాబోయే ఎన్నికలనాటికైనా దగ్గర కు వస్తారని ఆశపడుతున్నారంతే.

విచిత్రం ఏమిటంటే ఇపుడు ఆదిలాబాద్ ఎస్టీ ఎంపీ నియోజకవర్గం బీజేపీ చేతిలోనే ఉంది. సోయం బాబూరావు 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా గెలిచారు. మళ్ళీ ఈ సీటు లో బీజేపీ గెలుస్తుందో లేదో తెలీదు. అందుకనే ముందుగానే రిజర్వుడు నియోజకవర్గాల పైన దృష్టిపెట్టింది.

Tags:    

Similar News