హైకోర్టులో బన్నీ తరుపు న్యాయవాదులు... రిక్వస్ట్ ఇదే!

అవును... అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది.

Update: 2024-12-13 08:43 GMT

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును అశ్రయించగా.. దాన్ని లంచ్ మోషన్ పిటిషన్ గా విచారించాలని న్యాయవాదులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం వరకూ అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.

అవును... అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనలో తనపై పెట్టిన కేసును క్వాష్ చేయలంటూ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అది ఇంకా బెంచ్ ముందుకు రాలేదు!

దీంతో.. అల్లు అర్జున్ తరుపు న్యాయవాదులు జస్టిస్ శ్రీదేవి బెంచ్ ముందు ఓ అప్పీల్ చేశారు. ఇందులో భాగంగా... అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ ను లంచ్ మోషన్ పిటిషన్ గా విచారణ జరపాలని.. ఇదే సమయంలో సోమవారం వరకూ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు!

ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తరుపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలాంటి వెర్షన్ చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారిందని అంటున్నారు. మరోవైపు.. అల్లు అర్జున్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ రిమాండ్ చేయాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగా... పోలీస్ స్టేషన్ కి తరలించిన అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ని రికార్డ్ చేయడం.. అక్కడ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి, అనంతరం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ఇది రిమాండ్ కోసం పోలీసులు అనుసరించనున్న ప్రొసీడింగ్స్ అని తెలుస్తోంది.

Tags:    

Similar News