యూఎస్ లో ఇండియన్స్ కి తాజా తలనొప్పి ఇది!

ఈ మధ్యకాలంలో అగ్రారాజ్యానికి ప్రయాణమవుతున్న భారతీయ విద్యార్థులకు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2023-09-05 06:22 GMT

ఈ మధ్యకాలంలో అగ్రారాజ్యానికి ప్రయాణమవుతున్న భారతీయ విద్యార్థులకు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఎన్నో ఆశలతో యూఎస్ లో దిగిన విద్యార్థులను రిటన్ ఫ్లైట్ ఎక్కించేశారు ఇమిగ్రేషన్ అధికారులు. ఇదే సమయంలో మరో సమస్య తెరపైకి వచ్చింది.

అమెరికాలో భారతీయులకు వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. రెగ్యులర్ గా వినిపిస్తున్న తుపాకీ చప్పుల్లు, మగ్గింగ్ సమస్యలు ఒకెత్తు అయితే... తాజాగా తలదాచుకునే సమస్య మరొకటి బలంగా మొదలైందట. దీంతో వీసా సంపాదించడం ఒకెత్తు అయితే... అద్దె ఇల్లు దొరకబుచ్చుకోవడం మరొకెత్తులా మారిందని వాపోతున్నారు!

అవును... ఉన్నత విద్య కోసం యునైటెడ్ స్టేట్స్, కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థులు రెగ్యులర్ గా రెంట్ హౌస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికోసం ఆన్ లైన్ లో ఏ స్థాయిలో సెర్చ్ చేసినా అద్దె ఇల్లు దొరకకపోవడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. ఇదే సమయంలో కామన్ బాత్ రూం ఉండే గదులు సైతం దొరకడం లేదని అంటున్నారట.

ఇదే సమయంలో ప్రతీఏటా పెరుగుతున్న అంతర్జాతీయ విద్యార్థుల కోసం హాస్టల్ అకామ్మిడేషన్ అందించడంలో యూవర్సిటీ క్యాంపస్‌ లు కూడా పరిమితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి నగరాల్లో అద్దె ధరలు పెరుగుతున్నాయి! డబుల్ బెడ్ రూం ఇల్లు సగటు అద్దె ధర $1,500కి చేరుకుంది.

ఈ సమయంలో విద్యార్థులు గరిష్టంగా ఆన్‌ లైన్ రెంట్ ప్లాట్‌ ఫారమ్‌ లను ఎంచుకుంటున్నారు. అయితే వీటిలో ముందుగానే డబ్బులు కొంతమొత్తంలో డిపాజిట్ చేయాలి. సరే అనుకుని చేసినా... కోరుకున్న రూపంలో కాస్త కంఫర్ట్ అయిన ఇల్లు మాత్రం దొరకడం లేదు!

దీంతో అగ్రరాజ్యంలో భారతీయ విద్యార్థుల అద్దె కష్టాలు తీరేదెన్నడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో క్యాంపస్ లే సరైన పరిష్కారం చూపిస్తే... సౌకర్యవంతం సంగతి దేవుడెరుగు.. అద్దె ఇంటి సెర్చింగ్ కష్టాలు తీరతాని చెబుతున్నారు.

కాగా... కరోనా మహమ్మారి వ్యక్తిగత జీవితాల్ని, ఆర్ఠిక పరిస్థితిని దారుణంగా దెబ్బ తీసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్న వారు తమ సొంతింటిని వదిలించుకొని అద్దె ఇంట్లోకి మారిపోతున్న సంఘటనలు వరుసగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా అద్దె ఇంటికి అనూహ్యమైన డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు! అయితే ఇది రెండేళ్ల క్రితం సమస్య అయినప్పటికీ... ఇప్పటికీ కంటిన్యూ అవుతుండటం కొసమెరుపు!

Tags:    

Similar News