అమెరికాలో రోడ్డు ప్రమాదం... తెలుగు కుటుంబం చిన్నాభిన్నం!
ఈ మధ్య కాలంలో అమెరికాలో రోడ్డు ప్రమాదాల్లో తెలుగువారు చనిపోతున్న ఉదంతాలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఫలితంగా సప్తసముద్రాల అవతల తెలుగువారి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి.
ఈమధ్యకాలంలో అమెరికాలో రోడ్డు ప్రమాధాలలో గాయపడుతున్న, మరణిస్తున్న భారతీయుల సంఖ్య పెరిగిపొతోందని అంటున్నారు. అమెరికాలో ఏ రోడ్డు ప్రమాధం జరిగినా, ఏ ప్రాంతంలో తుపాకీ చప్పుళ్లకు సంబంధించిన వార్తలు వినిపించినా.. ఇండియాలో ఉన్న వారు ఉలిక్కిపడుతున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి.
అవును... ఈ మధ్య కాలంలో అమెరికాలో రోడ్డు ప్రమాదాల్లో తెలుగువారు చనిపోతున్న ఉదంతాలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఫలితంగా సప్తసముద్రాల అవతల తెలుగువారి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా యూఎస్ లో యలమంచిలి కుటుంబానికి సంబంధించిన అటువంటి ఒక దారుణమైన సంఘటన జరిగింది.
వివరాళ్లోకి వెళ్తే... కళ్యాణ్ యలమంచిలి, అతని భార్య దివ్య.. వారి కుమారుడు ఈశ్వర్ 2022 మధ్యలో అమెరికాకు వెళ్లారు. కళ్యాణ్, దివ్య అక్కడే స్థిరపడాలని ఆకాంక్షించారు. ఫలితంగా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భావించారు. అయితే ఈ లోపు విధి వక్రించింది!
ఈ ఏడాది జూలై 21వ తేదీన ఆ కుటుంబం ఘోర కారు ప్రమాదానికి గురవ్వడంతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారైపోయాయి. అమెరికాలోని షార్లెట్ లో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురూ ఆస్పత్రి పాలయ్యారు.
ఇలా అత్యంత ఘోరంగా జరిగిన ఈ ప్రమాదంలో పిల్లవాడితో సహా ముగ్గురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారు. దీంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. ఫలితంగా కుటుంబం కఠినమైన సవాలును ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ప్రమాదంలో మూగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలతో పోరాడుతున్నారు.
ఈ ప్రమాదంలో దివ్యకు అనేక చోట్ల ఎముకలు విరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా లైఫ్ సపోర్టుపై ప్రాణాలతో పోరాడుతోంది. ఇదేసమయంలో... కళ్యాణ్ ఇంటర్నల్ బ్లీడింగ్ తో బాదపడుతున్నాడు. అదేవిదంగా మోకాళ్లు పగిలిపోయాయి.
ఇదే క్రమంలో వారి కుమారుడు 4 సంవత్సరాల వయస్సు గల ఈశ్వర్... ముఖంపై తీవ్రగాయాలతోపాటు, తొడ ఎముక విరిగిపోయింది. దీంతో ఒక్క ప్రమాదం ఆ కుటుంబాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసేసింది. ప్రస్తుతం కుటుంబంలోని ముగ్గురు సభ్యులూ ఆస్పత్రిలో పోరాడుతున్నారు.
ఈ విషయం గురించి తెలుసుకున్నవారు ఈ కుటుంబాం గురించి విచారం వ్యక్తం చేస్తున్నారు.. త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో.. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికీ రాకూడదని భగవంతుడిని వేడుకుంటున్నారు.