ఇలియానా డి క్రజ్ తాను మాతృత్వాన్ని స్వీకరించానని మగబిడ్డను స్వాగతించానని తాజా ప్రకటనలో వెల్లడించింది. ఇల్లీ తన ఆనందాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. తన వారసునికి కో ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. కో ఫీనిక్స్ అంటే యోధుడు లేదా పరాక్రమవంతుడు అని అర్థం.
ఇలియానా తన బిడ్డ ఫోటోని షేర్ చేస్తూ ``కోవా ఫీనిక్స్ డోలాను పరిచయం చేస్తున్నాను. 1 ఆగస్ట్ 2023న జన్మించాడు. మా డార్లింగ్ బాయ్‌ని ప్రపంచానికి స్వాగతిస్తున్నందుకు ఎంత సంతోషిస్తున్నానో మాటల్లో చెప్పలేను. హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది`` అని తెలిపింది. తన భర్త గురించి చాలా కాలంగా సీక్రెట్ గా ఉంచిన ఇలియానా ఇటీవలే అతడి ముఖాన్ని పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన బాయ్‌ఫ్రెండ్ తో ఉన్న మధురక్షణాలను షేర్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన అభిమానులకు సంతోషకరమైన డేట్ నైట్ ఫోటో కోల్లెజ్‌ను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
ఇలియానా కొన్నాళ్లుగా కెరీర్ కి బ్రేక్ నిచ్చింది. తన తొలి సంతానం కోసం వేచి చూసే క్రమంలోనే ఈ బ్రేక్. అంతకుముందు అభిషేక్ బచ్చన్‌తో కలిసి `ది బిగ్ బుల్`లో చివరిగా కనిపించిన ఇలియానా తదుపరి రణదీప్ హుడా నటించిన `అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ`లో కనిపించనుంది.