దేవియాని శర్మ.. బికినీలో హై గ్లామర్ కిక్

టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి దేవియాని శర్మ.

Update: 2024-11-23 16:40 GMT

టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి దేవియాని శర్మ. అమ్మడు లేటెస్ట్ గా తన గ్లామరస్ ఫొటోషూట్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. "రూల్ బుక్ ప్రకారం నడవను!" అనే క్యాప్షన్‌తో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. బ్లాక్ క్రాప్ టాప్, బికినీ డ్రెస్‌లో తన ఘాటైన లుక్‌ను హైలైట్ చేసింది, ఈ స్టిల్ లో దేవియాని ఆహ్లాదకరమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది. సన్‌గ్లాసెస్ వేసుకుని స్టైలిష్‌గా ఇచ్చిన ఈ పోజులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సోషల్ మీడియాలో దేవియాని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌తో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. ఆ మధ్య వైట్ సారి, ఎథ్నిక్ వేర్‌లో ఒక విధంగా మెరిసిపోయిన దేవియాని, ఇప్పుడు ఇలా మోడ్రన్ అవతార్‌లో అందాలతో కొత్త తరహా స్టైల్ చూపించింది. ఈ ఫోటో షేర్ చేసిన కొద్దిసేపటికే లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుండగా, స్టన్నింగ్ లుక్, సూపర్ గ్లామర్ షో అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

దేవియాని కెరీర్ విషయానికి వస్తే, తన సినీ ప్రయాణాన్ని నవీన్ చంద్ర సరసన 'భానుమతి రామకృష్ణ' మూవీతో ప్రారంభించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత 'రొమాంటిక్' చిత్రంలో కనిపించి యూత్‌ని ఆకట్టుకుంది. తాజాగా 'సైతాన్', 'సేవ్ ది టైగర్స్' వంటి వెబ్‌సిరీస్‌లతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు సిరీస్‌లు ఆమెకు కొత్త అభిమానులను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈ సిరీస్‌ల సీక్వెల్స్‌లోనూ నటించేందుకు సిద్ధమవుతోంది.

ఆమె కేవలం నటనలోనే కాకుండా, గ్లామర్ ప్రెజెంటేషన్‌లోనూ తనదైన ముద్ర వేసుకుంటోంది. బోల్డ్ రోల్స్‌లో దేవియాని అద్భుతంగా ఇమిడిపోవడం ఆమె ప్రత్యేకత. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న దేవియాని, ఇటు వెబ్ సీరీస్ లలో కూడా మెరుస్తోంది. మరి అమ్మడు లక్కు ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News