ముచ్చటేస్తున్న కీర్తి, సమంతల బంధం
సాధారణ వ్యక్తుల్లానే సెలబ్రిటీలకు కూడా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటూంటారు.
సాధారణ వ్యక్తుల్లానే సెలబ్రిటీలకు కూడా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటూంటారు. ఫ్రెండ్స్ అంటే ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లే ఉండాలని రూలేం లేదు. ఫ్రెండ్‌షిప్ కు అవధుల్లేవు అని అందుకే అంటారు. టాలీవుడ్ లో పలు సినిమాలు చేసి మంచి క్రేజ్ అందుకున్న సమంత రూత్ ప్రభు, కీర్తి సురేష్ ల మధ్య మంచి స్నేహం ఉన్నట్టు ఇప్పటికే పలుసార్లు బయటపడింది.
ఇప్పుడు మరోసారి వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూపిస్తూ వారి స్నేహానికి ఎలాంటి సరిహద్దులు లేవని నిరూపించారు. కీర్తి సురేష్ కు సమంత రీసెంట్ గా ఓ గిఫ్ట్ హ్యాంపర్ ను పంపింది. సమంత క్లాత్ బ్రాండింగ్ స్టోర్ అయిన సాకి నుంచి సామ్ కీర్తికి కొన్ని అవుట్‌ఫిట్స్ ను పంపగా, దాని గురించి కీర్తిసోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ గిఫ్ట్ హ్యాంపర్ ను చూసిన కీర్తి సమంతకు కృతజ్ఞతలు తెలియచేసేలా ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసింది.
ఇంత అందమైన హ్యాంపర్ ను పంపినందుకు సాకి, సమంతకు థ్యాంక్స్ అని కీర్తి రాసుకొచ్చింది. కీర్తికి సమంత పంపిన గిఫ్ట్ హ్యాంపర్ కేవలం వారి మధ్య పరిచయాన్ని మాత్రమే కాకుండా తమ మధ్య బాండింగ్ ను తెలుపుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత నుంచి ఆఖరిగా సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ రాగా, కీర్తి సురేష్ రీసెంట్ గానే తన బాలీవుడ్ డెబ్యూ బేబీ జాన్ తో ప్రేక్షకుల్ని పలకరించింది.
గతంలో కూడా వీరిద్దరూ ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకున్నారు. సమంతను చూసి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, ఎలాంటి క్యారెక్టర్‌నైనా సమంత చాలా ఈజీగా చేసేస్తుందని, ఆమెను చూసి తాను కూడా అలా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పిన కీర్తి సురేష్.. మహానటిలో తామిద్దరూ కలిసి నటించామని, తమ మధ్య సీన్స్ లేకపోయినా ఆ సినిమా షూటింగ్ తనకెప్పటికీ మంచి మెమొరీ అని చెప్పింది.