కన్నప్ప రిలీజ్ తర్వాత మాట్లాడతా..!

మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప.

Update: 2025-02-26 15:17 GMT

మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. నేడు మహా శివరాత్రి సందర్భంగా కన్నప్ప సినిమా టీం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఆ భగవంతుడి ఆశీర్వాదంతో కన్నప్ప చేస్తున్నాం ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మా సినిమాకు ఉండాలని అన్నారు. ఇక సినిమా రిలీజ్ తర్వాత అన్ని విషయాలు మాట్లాడతా అని అన్నారు మోహన్ బాబు.

మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. హైదారాబాద్ లో మోహన్ బాబు ఉన్నప్పుడు మొదలైన ఈ గొడవలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మంచు మనోజ్ ఈమధ్య ఎక్కువగా ఈ గొడవల్లో కనిపిస్తున్నాడు. ఐతే అసలు వారి మధ్య ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఎవరికీ తెలియదు కానీ ప్రతిసారి మోహన్ బాబు ఎక్కడ ఉంటే అక్కడికి మనోజ్ వెళ్లడం నానా హంగామా చేయడం జరుగుతుంది.

ఈమధ్య మనోజ్ ఒక రిసార్ట్ లో ఉన్న టైం లో పోలీసులు వచ్చి డిస్టర్బ్ చేశారని స్టేషన్ కి వెళ్లి నానా రచ్చ చేశాడు. ఐతే తన ఫ్యామిలీ మెంబర్సే కావాలని తన మీద పోలీసులను పంపిస్తున్నారు అన్నట్టుగా మనోజ్ వాదన వినిపించాడు. ఐతే తన ఫ్యామిలీలో జరుగుతున్న ఈ గొడవల వల్ల మంచు ఫ్యామిలీ గురించి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటున్నారు.

అందుకే నేడు శ్రీకాళహస్తి కి వచ్చి దర్శనం చేసుకున్నాక మోహన్ బాబు కన్నప్ప రిలీజ్ తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని అన్నారు. సినిమాను పూర్తి చేసి రిలీజ్ ప్రమోషన్స్ చేస్తున్న టైం లో ఈ వివాదాల వల్ల సినిమా మీద ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మోహన్ బాబు కన్నప్ప రిలీజ్ తర్వాత మాట్లాడతానని అన్నారు. కన్నప్ప సినిమా మీద మంచు విష్ణు తన ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. సినిమాలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు నటించారు. సినిమాను సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. కన్నప్ప నుంచి రిలీజైన శివ శివ సాంగ్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతకుముందు కన్నప్ప టీజర్ తో విమర్శలు అందుకున్న మంచు విష్ణు ఈ సాంగ్ తో సినిమాపై మంచి బజ్ ఏర్పరచుకున్నాడు.

Tags:    

Similar News