నన్ను దుబాయిలో అరెస్ట్ చేశారన్నది అవాస్తవం : పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి తనపై ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలను ఖండించారు.
తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి తనపై ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలను ఖండించారు. మీడియా ఛానెళ్లతో పాటు సోషల్ మీడియాలో తాను దుబాయ్‌లో అరెస్ట్ అయ్యానని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేసిన ఆయన, ప్రస్తుతం తాను హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలోనే ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
పైలెట్ రోహిత్ రెడ్డి ఈ సందర్భంగా వీడియోను విడుదల చేసి మాట్లాడారు. ‘‘మహా శివరాత్రి సందర్భంగా తాండూర్ ప్రజలకు శుభాకాంక్షలు. తాండూర్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలు అందించాలని ఆ భగవంతుడు మహాశివుడిని ప్రార్థిస్తున్నాను. తాండూర్ నియోజకవర్గం అన్ని విధాలుగా బాగుండాలి.’ అని ఆయన తెలిపారు.
‘ఈరోజు కొన్ని మీడియా చానెల్లలో ఏవేవో తనపై వార్తలు కథనాలు ప్రసారం చేస్తున్నారని .. దుబాయ్ లో తనను అరెస్ట్ చేశారని.. ఇంకేదోనని ఇష్టమొచ్చినట్టు కథనాలు ప్రసారం చేస్తున్నారని.. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు’ అని పైలెట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. నేను హైదరాబాద్ లోని మణికొండ లో గల తన ఇంట్లో ఉన్నానని వీడియోలో క్లారిటీ ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులను, పార్టీ శ్రేణులను అందరికీ తెలియజేసేది ఏంటంటే.. ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు ఎవ్వరూ నమ్మొద్దని అందరికీ సూచించారు.