మెగా అల్లుడికి ఇంకా సెట్ అవ్వలేదా?
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ `ఆదికేశవ` వైఫల్యం తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిన సంగతి తెలిసిందే.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ `ఆదికేశవ` వైఫల్యం తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొత్త సినిమా అప్ డేట్ ఏది ఇవ్వలేదు. కెరీర్ మొదలు పెట్టిన నాలుగేళ్లలోనూ మూడు సినిమాలు చేసాడు. ` ఉప్పెన` ,` కొండపొలం`, `రంగ రంగ వైభవంగా` అంటూ ప్రేక్షకుల్ని అలరించాడు. `ఆదికేశవ` కూడా సోసోగా ఆడిన చిత్రమే.
ఒక సినిమా సెట్ లో ఉండగానే మరో సినిమాని లైన్ లో పెట్టి వేగంగానే సినిమాలు చేసాడు. కానీ ఏడాది కాలంగా ఆ స్పీడ్ కనిపించలేదు. దీంతో వైష్ణవ్ తేజ్ మౌనం దేనికి? అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో కొత్త సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైష్ణవ్ తేజ్ కూడా భారీ పాన్ ఇండియా సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? ఈ నేపథ్యంలోనే కొత్త ప్రాజెక్ట్ డిలే చేస్తున్నాడా? అంటూ సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
ఆ మధ్య ఓ కొత్త కాన్సెప్ట్ తో ఓ సినిమా చేస్తున్నాడని ప్రచారంలోకి వచ్చింది. దానికి `వచ్చాడయ్యో సామీ` అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్ల వార్తలొచ్చాయి. కానీ దర్శకుడు ఎవరు? ప్రొడక్షన్ హౌస్ వివరాలు మాత్రం బయటకు రాలేదు. అయితే ఇదంతా ఐదు నెలల క్రితం ప్రచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మళ్లీ ఎక్కడా వార్త రాలేదు. టైటిల్ ని బట్టి ముందు అనుకున్న ప్రాజెక్ట్ కేవలం రీజనల్ మార్కెట్ కే సరిపోతుంది.
కానీ తాజా కథనాలు ఏంటంటే? పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగానే ఈ డిలే జరుగుతుందని మెగా సోర్సెస్ ద్వారా కొన్ని లీకులందుతున్నాయి. `విరూపాక్ష` తర్వాత సాయి దుర్గతేజ్ కూడా కొత్త ప్రాజెక్ట్ విషయంలో చాలా లోతైన ఆలోచన చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సాయిని 100 కోట్ల క్లబ్లో చేర్చడంతో తర్వాత కొట్టేది పాన్ ఇండియా హిట్ మాత్రమే అవ్వాలని రోహిత్ కే.పిని తెరపైకి తెచ్చి `సంబరాల ఏటిగట్టుని` పట్టాలెక్కించాడు. మరి ఇప్పుడు వైష్ణవ్ కూడా సాలిడ్ కంటెంట్ కోసం ఎదురు చూపుల్లో భాగంగానే ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.