ఫోటో స్టోరి: పాలకోవా అందాలు..!

బాలీవుడ్‌లో న‌ట‌వార‌సుల హ‌వా కొన‌సాగుతోంది. గ‌త ఏడాది అర‌డ‌జ‌ను మంది స్టార్ కిడ్స్ తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు.

Update: 2024-11-23 02:30 GMT

బాలీవుడ్‌లో న‌ట‌వార‌సుల హ‌వా కొన‌సాగుతోంది. గ‌త ఏడాది అర‌డ‌జ‌ను మంది స్టార్ కిడ్స్ తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఓటీటీ, వెండితెర‌పై అదృష్టం ప‌రీక్షించుకుంటున్నవారిలో నట‌వార‌సురాళ్లు ఉన్నారు. వీరంతా పెద్ద తెర‌పైనా వెలిగేందుకు క‌ల‌లు కంటున్నారు. బుల్లితెర న‌టి శ్వేతా తివారీ న‌ట‌వార‌సురాలు పాల‌క్ తివారీ కూడా ఈ జాబితాలో ఉంది. సుహానా, ఖుషి క‌పూర్ లాంటి భామ‌ల కంటే ముందే పాల‌క్ తివారీ వెండితెర‌కు ప‌రిచ‌య‌మైంది.

ఈ బ్యూటీ అంద‌చందాలు కిల్ల‌ర్ లుక్స్ కి వీరాభిమానులున్నారు. ఈ అందం ఒక మైమ‌ర‌పు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖాన్ తో డేటింగ్ చేస్తోందంటూ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో కొస్తోంది. ఈ జంట రిలేష‌న్ షిప్ కి ఇరు కుటుంబాల నుంచి అంగీకారం ఉంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇదిలా ఉంటే, పాల‌క్ - ఇబ్ర‌హీం విహార యాత్ర‌లు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

ఇప్పుడు న‌ట‌వార‌సుర‌లు పాలక్ తివారీ ఇటీవలి మాల్దీవుల విహారయాత్రలో గొప్ప సమయాన్ని గడిపారు. అందుకు రుజువు ఈ ఫోటోలే అంటూ కొన్ని ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ చేసారు నెటిజ‌నులు. పాల‌క్ త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 4.8 మిలియన్ల మంది అనుచరులకు వెకేష‌న్ ఫోటోలతో ట్రీటిచ్చింది. అయితే అదే స‌మ‌యంలో బాయ్‌ఫ్రెండ్ ఇబ్రహీం అలీ ఖాన్ ఇటీవల అదే మాల్దీవుల నుండి తన ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో ఆ ఇద్ద‌రూ క‌లిసే ఉన్నార‌ని.. వారి మ‌ధ్యా ఏదో జ‌రుగుతోందంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స్టార్ కిడ్స్ కలిసి తమ విహారయాత్రను ఆస్వాధిస్తున్నారనే ఊహాగానాలకు ఇది తెర‌తీసింది. అంతేకాదు పాల‌క్ సోలో ఫోటోల‌ను ఇబ్ర‌హీం ఫోన్ లో తీసార‌ని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.

ఇక ఈ ఫోటోగ్రాఫ్స్ లో బాడీ హగ్గింగ్ క్ ట్యూబ్ డ్రెస్‌తో పాల‌క్ రాక్ చేసింది. వీటిలో కొన్ని పాలక్ సెల్ఫీలు అయితే, మ‌రికొన్నిటిని ఇబ్రహీం అలీ ఖాన్ క్లిక్ చేసారని అభిమానులు భావిస్తున్నారు. ఈ ట్రిప్ లో పాల‌క్ బోట్ రైడ్‌ను ఆస్వాధించింది. పాలక్ తివారీ, ఇబ్రహీం అలీఖాన్‌లు డేటింగ్‌లో ఉన్నట్లు గత ఏడాది కాలంగా పుకార్లు షికార్ చేయ‌డంతో ఈ ఫోటోల‌పై ప్ర‌త్యేక ఆస‌క్తి క్రియేట్ అయింది.

పాలక్ తివారీ సల్మాన్ ఖాన్ మల్టీ స్టారర్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. త‌దుప‌రి భారీ చిత్రంలో న‌టించేందుకు సంత‌కం చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇబ్రహీం అలీ ఖాన్ `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` చిత్రానికి కరణ్ జోహార్ తో క‌లిసి ప‌ని చేసాడు. ఖుషీ క‌పూర్ తో క‌లిసి ఓ ప్రాజెక్టు లో ఇబ్ర‌హీం న‌టిస్తున్నాడు.

Tags:    

Similar News