చంద్రబాబు తో వీరసింహా రెడ్డి డైరెక్టర్ మెమొరబుల్ మూమెంట్
ఈ పార్టీకి నందమూరి, నారా కుటుంబీకులతో పాటూ వారి దగ్గరి బంధువులు కూడా హాజరయ్యారు. పార్టీలో బాలయ్యను ఉద్దేశించి చంద్రబాబు, లోకేష్ మాట్లాడిన మాటలు హైలైట్ అయ్యాయి.
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బాలకృష్ణ క్రేజ్ సినిమా సినిమాకీ పెరుగుతుంది. వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ఫ్యాన్స్ కు తన సినిమాలతోనే కాకుండా రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికై ఆ విధంగా కూడా ట్రీట్ ఇచ్చాడు. అన్నయ్యకు దక్కిన గొప్ప పురస్కారానికి తన చెల్లెలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి భారీ పార్టీని అరేంజ్ చేసింది.
ఈ పార్టీకి నందమూరి, నారా కుటుంబీకులతో పాటూ వారి దగ్గరి బంధువులు కూడా హాజరయ్యారు. పార్టీలో బాలయ్యను ఉద్దేశించి చంద్రబాబు, లోకేష్ మాట్లాడిన మాటలు హైలైట్ అయ్యాయి. ఈ పార్టీకి నందమూరి, నారా ఫ్యామిలీలు హాజరవగా హరికృష్ణ కొడుకులైన జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం హాజరు కాలేదని తెలుస్తోంది.
భారీ సంఖ్యలో గెస్టులు హాజరైన ఈ పార్టీలో అందరూ నారా, నందమూరి కుటుంబాలకు చెందిన వారే అని సమాచారం. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం చాలా తక్కువ మందికే ఈ పార్టీకి ఆహ్వానం వెళ్లింది. వారిలో అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ దర్శకులకు, నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీకి ఆయా సినిమాల దర్శకనిర్మాతలు హాజరైనట్టు తెలుస్తోంది.
అయితే ఈ పార్టీకి వెళ్లిన వారిలో బాలయ్యతో సూపర్ హిట్ అందుకున్న వీర సింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా ఉన్నాడు. పార్టీకి వెళ్లిన గోపీచంద్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఫోటో దిగి దాన్ని నెట్టింట షేర్ చేసుకున్నాడు. చంద్రబాబు గారితో ఓ మెమొరబుల్ ఈవెనింగ్ చాలా ఆనందాన్ని కలిగించిందని ఆయన తెలిపాడు.
కాగా గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా జాత్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకుని బాలీవుడ్ లో సెటిలవాలని చూస్తున్నాడు గోపీచంద్. మరి జాత్ తనకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.