పుష్ప 2 మూవీ 59వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?
అయితే నార్త్ ఇండియాలో మాత్రం ఇంకా కొన్ని థియేటర్స్ లో సినిమాని ప్రదర్శిస్తున్నారు.
ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీలో ‘బాహుబలి 2’ పేరు మీద ఉన్న రికార్డ్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 1860 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సౌత్ లో ఈ మూవీ జోరుకి శుభం కార్డు పడిపోయింది. అయితే నార్త్ ఇండియాలో మాత్రం ఇంకా కొన్ని థియేటర్స్ లో సినిమాని ప్రదర్శిస్తున్నారు.
ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యి ట్రెండింగ్ లో కొనసాగుతోంది. థియేటర్స్ లో వచ్చిన స్థాయిలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీకి ఆదరణ లభిస్తూ ఉంది. కచ్చితంగా వ్యూవ్స్ పరంగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి థియేటర్స్ లో 59వ రోజు 10 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని జాతీయ మీడియా ప్రచారం చేసింది.
దీనిని బట్టి నార్త్ ఆడియన్స్ ఈ చిత్రానికి ఏ స్థాయిలో ఎడిక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 1233.60 కోట్ల నెట్ కలెక్షన్స్ ఈ చిత్రానికి వచ్చాయి. వాటిలో మెజారిటీ 820 కోట్ల వరకు నార్త్ ఇండియాలోనే వసూళ్లు కావడం విశేషం. తెలుగు వెర్షన్ కంటే ఎక్కువ ఆదరణ, కలెక్షన్స్ హిందీలో ‘పుష్ప 2’ మూవీకి వచ్చాయి. అక్కడి బాలీవుడ్ స్ట్రైట్ సినిమాల కలెక్షన్స్ రికార్డ్స్ ని కూడా ‘పుష్ప 2’ బ్రేక్ చేసి చరిత్ర సృష్టించింది.
నార్త్ ఇండియా ఆడియన్స్ అయితే ఇప్పటికి ‘పుష్ప 2’ హ్యాంగోవర్ లోనే ఉన్నారనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా రూరల్ ఏరియాలలో మాస్ ఆడియన్స్ అయితే చిత్రాన్ని ఎగబడి చూసారు. ఇప్పటికి చూస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే సినిమాకి ఆ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇప్పటికే ‘పుష్ప 2’ మూడ్ నుంచి బయటకొచ్చి నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన ఫోకస్ చేయడానికి రెడీ అవుతున్నాడని అనుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ చేయనున్నాడు. మైథలాజికల్ కథాంశంతో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా అఫీషియల్ అప్డేట్ ఎప్పుడొస్తుందనేది చూడాలి.