దుల్కర్ 'ఆకాశంలో ఒక తార' లాంఛ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ మంచి హిట్స్ సొంతం చేసుకుంటున్నారు. పాన్ ఇండియా హీరోగా మారి సత్తా చాటుతున్నారు. తెలుగులో మహనటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో మరిచిపోలేని సక్సెస్ ను అందుకున్నారు దుల్కర్.
ప్రస్తుతం టాలీవుడ్ హల్క్ రానాతో కలిసి కాంత మూవీ చేస్తున్నారు. అదే సమయంలో కొద్ది రోజుల క్రితం తన బర్త్ డే రోజు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఆకాశంలో ఒక తార అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా.. పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మంచి రెస్పాన్స్ అందుకున్న ఆ పోస్టర్.. అప్పట్లో ఫుల్ ట్రెండ్ అయింది.
పోస్టర్ లో రెడ్ కలర్ కండువా వేసుకుని ఓ రైతుగా దుల్కర్ సల్మాన్ కనిపించారు. ఆయనతోపాటు ఓ అమ్మాయి స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో సినిమా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుందని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అలా ఒక్క పోస్టర్ తోనే మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయని చెప్పాలి.
తాజాగా ఆకాశంలో ఒక తార మూవీ అఫీషియల్ గా లాంఛ్ అయింది. హైదరాబాద్ లో జరిగిన ఆ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాకూర్ లేదా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తారని కొద్ది రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది.
కానీ ఇప్పుడు మేకర్స్.. సాత్విక వీరవల్లిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇప్పుడు అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కంప్లీట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. దీంతో అంతా మేకర్స్ కు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. టాలీవుడ్ టాప్ బ్యానర్లు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంస్థలతో కలిసి సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియన్ లెవెల్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది ఆకాశంలో తార మూవీ. మరి ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే వేచి చూడాలి.