అలా అడిగే స‌రికి పూజాహెగ్డే కి కోపం త‌న్నుకొచ్చింది!

షాహిద్ క‌పూర్, పూజాహెగ్డే జంట‌గా న‌టించిన 'దేవా' చిత్రం రిలీజ్ లో భాగంగా ఇద్ద‌రు ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. ఈ నేప‌థ్యంలో పూజాహెగ్డే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గోంది.

Update: 2025-02-02 11:30 GMT

ముంబై బ్యూటీ పూజాహెగ్డే బాలీవుడ్ మీడియాపై సీరియ‌స్ అయిందా? పాత్రికేయుల తీరుతో తీవ్ర అస‌హ‌నానికి గురైందా? ఇరువురి మ‌ధ్య నువ్వెంతంటే నువ్వెంత‌నే వ‌ర‌కూ సీన్ దారి తీసిందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది. షాహిద్ క‌పూర్, పూజాహెగ్డే జంట‌గా న‌టించిన 'దేవా' చిత్రం రిలీజ్ లో భాగంగా ఇద్ద‌రు ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. ఈ నేప‌థ్యంలో పూజాహెగ్డే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గోంది.

ఇంట‌ర్వ్యూ అంతా స‌జావు గా సాగుతుంది. వాతావ‌ర‌ణమంతా కూల్ గా ఉంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో బాలీవుడ్ స్టార్ హీరోలతో న‌టించ‌డాన్ని అదృష్టంగా భావిస్తున్నారా? ఆ చిత్రాల‌కు మీరు అర్హులే అనుకుంటున్నారా? అని ఒక‌రు అడిగారు. దానికి పూజా ఇలా బ‌ధులిచ్చింది.` అందుకు అర్హురాలినే. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు న‌న్ను ఎంచుకోవ‌డానికి కొన్ని కార‌ణాలుంటాయి. ఏ పాత్ర‌లో అవ‌కాశం వ‌చ్చినా దానికి పూర్తిగా న్యాయం చేయాలి.

అందుకు త‌గ్గ‌ట్టు న‌న్ను నేను మ‌లుచుకోవాలి. అలా చేస్తే అదృష్టం వ‌రించిన‌ట్లే భావిస్తా. ఇప్ప‌టి వ‌ర‌కూ నా జీవితంలో అదే జ‌రిగింది. ఒక‌వేళ అదృష్టం వ‌ల్లే అవ‌కాశాలు వ‌చ్చాయి అనుకుంటే? అందుకు నేను బాధ‌ప‌డ‌ను. అలాగే అనుకోండ‌ని బ‌ధులిచ్చింది. ఆ వెంట‌నే మ‌రొక‌రు స్టార్ హీరోలైతేనే సినిమాలు చేస్తారా? అని అడిగారు. దీంతో పూజాహెగ్డేకి ఎక్క‌డ లేని కోపం చిర్రెత్తుకొచ్చింది. `అస‌లు మీ స‌మ‌స్య ఏంట‌ని ఒక్క‌సారిగా అడిగిన వాళ్ల‌పై సీరియ‌స్ అయింది.

దీంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా హీటెక్కింది. మాట మాట పెరిగేలా క‌నిపించింది. దీంతో ప‌క్క‌నే ఉన్న షాహిద్ క‌పూర్ లైన్ లోకి వ‌చ్చి స‌ర‌దాగా అక్క‌డ స‌న్నివేశాన్ని మార్చాడు. `నువ్వు న‌టించిన స్టార్ హీరోలంటే అత‌డికి ఇష్టం అను కుంటా. అత‌డు కూడా వాళ్ల‌తో న‌టించాలనుకుంటున్నాడు. అందుకే నిన్ను అడిగి నీ స‌ల‌హాలు తీసుకుంటున్నారుని స‌ముదాయించాడు. దీంతో అక్క‌డ వాతావ‌ర‌ణం కూల్ అయింది.

Tags:    

Similar News