గాండీవధారి అర్జున.. ఈ వింటేజ్ కార్ ఎందుకంత స్పెషలో
మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా సినిమాకు చాలా వ్యత్యాసం చూపిస్తూ కథలను ఎంచుకుంటున్నారు.
మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా సినిమాకు చాలా వ్యత్యాసం చూపిస్తూ కథలను ఎంచుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి నెవర్ బిఫోర్ అనెలా డిఫరెంట్ స్టోరీస్‌కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలా ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు.
1960ల కాలం నాటి పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 60ల నాటి వాతావరణం, అప్పటి అనుభూతిని తెరపైకి తీసుకురావడానికి మూవీటీమ్ అదనపు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఇటీవలే యూఎస్ఏలో ఓ ఇంపార్టెంట్ సీక్వెన్స్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్‌ను సినిమాలోని కీలక పాత్రలపై చిత్రీకరించారు.
అయితే ఈ చిత్రంలో ఓ వింటేజ్ కార్‌ను స్పెషల్‌గా వినియోగించారు. చిత్రంలో అది కూడా కీలక పాత్ర పోషించిందట. అదే 1969 ముస్టంగ్ మెక్ 1 మోడల్ కార్. ఎంతగానో రీసెర్చ్ చేసి ఫైనల్‌గా ఈ కారును సెలక్ట్ చేశారట. ఈ విషయాన్ని ప్రవీణ్ సత్తారు చెప్పారు. ఆ కారును యూకేలోని ఓ 80ఏళ్ల పెద్దాయన దగ్గర నుంచి తీసుకున్నారని ప్రవీణ్ పేర్కొన్నారు. ఆ పెద్దాయన తన టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆ కారను కొనుగోలు చేశారట.
ఈ కారు సినిమాలోని హీరో పాత్రతో సమానంగా క్యారెక్టర్ పోషిస్తుందని, దాని పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. హీరో క్యారెక్టర్‌ను అది బాగా ఎలివేట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఆ కారులో కొత్త ఇంజిన్‌ను అమర్చడంతో పాటు ఎన్నో మోడిఫికెషన్స్ చేసినట్లు అన్నారు. ఆ కారును రీమోడల్ చేయడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టిందట.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ముస్తాబవుతున్న ఈ చిత్రంలో వరుణ్ సెక్యురిటీ ఎక్స్‌పర్ట్‌గా కనిపించనున్నారట. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాల్ని చూస్తే.. సినిమాలో యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. పూర్తిగా లండన్ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతోంది.