అన్ని అనుకున్నట్లుగా జరగవు. అందులోకి రాజకీయాల్లో ఇలాంటి ఇబ్బంది మరింత ఎక్కువ. అనుకోకుండా వచ్చి పడిన సమస్యను అధిగమించేందుకు ఆకర్షణీయమైన పథకాన్ని ప్రభుత్వాధినేతలు ఆలోచించినా.. అలాంటి వాటిని అమలు చేసే సమయంలోఎదురయ్యే సమస్యలు సర్కారుకు చుక్కలు చూపిస్తుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది కేసీఆర్ సర్కారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. వరదలతో దెబ్బ తిన్న కుటుంబాలకు తాత్కాలికంగా రూ.10వేలు చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించటం తెలిసిందే.
తొలి దశలో ప్రతి ఇంటికి రూ.10వేల పరిహారం.. తదనంతరం వారు నష్టపోయిన దానికి తగ్గట్లు రూ.50వేలు.. రూ.లక్ష చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని భావించారు. విన్నంతనే వావ్ అనిపించేలా ఉన్న ఈ ప్లాన్.. అమల్లోకి వెళ్లేసరికి ప్లాఫ్ షోగా మారటం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది మారింది. చరిత్రలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీగా పరిహారాన్ని అందించనప్పటికీ.. తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అన్నింటికి మించి వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. బాధితుల నోటి నుంచి సర్కారు శాపనార్థాలు పెట్టించుకోవాల్సిన దుస్థితి.
వరద పరిహారం కింద ప్రతి ఇంటికి రూ.10వేలు ఇవ్వటం ద్వారా బోలెడంత మైలేజీ సొంతం చేసుకోవచ్చని కేసీఆర్ సర్కారు భావించింది. బాధితుల్ని గుర్తించే విషయంలో కాస్త ఉదారంగానే వ్యవహరించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో.. పార్టీ నేతలు.. అధికారులు ఈ పరిహారం విషయంలో కక్కుర్తి పడొద్దన్న వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వం ఒకలా ఆలోచిస్తే.. మరోలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాదాపు నాలుగు లక్షల మంది వరకు బాధిత కుటుంబాలు ఉంటాయని లెక్కించి పరిహార పంపిణీ మొదలు పెట్టారు.
శుక్రవారం నాటికి దాదాపు 3.2లక్షల కుటుంబాలకు సాయం అందించినట్లుగా అధికార లెక్కలు చెబుతున్నా.. వాస్తవంలో మాత్రం పరిహారం అందిన అసలైన బాధితులు వీరిలో40 శాతం మాత్రమేనని లోగుట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో.. మొదట అనుకున్న నాలుగు లక్షల కుటుంబాలు కాస్తా.. ఇప్పుడు ఆరేడు లక్షల కుటుంబాల వరకు పెరిగే ప్రమాదం ఉందన్న మాట వినిపిస్తోంది. వీటికి అదనంగా ఆందోళనలు.. పంచాయితీలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అలెర్టు అయిన ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న పరిహారాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది.
ఉదారంగా పరిహారాన్ని అందించటం ద్వారా భారీ మైలేజీ సొంతమవుతుందని అనుకుంటే.. అందుకు భిన్నంగా ప్రజాగ్రహం పెరిగిన వైనం తెలంగాణ అధికారపక్షానికి మింగుడుపడటం లేదంటున్నారు. ఏదో అవుతుందనుకుంటే.. మరేదో అయ్యిందన్న మాట వారి నోట వినిపించటం గమనార్హం. పరిహారాన్నిబంద్ చేయాలన్న తాజా నిర్ణయంతో.. దాని కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారి ఆగ్రహం ఏ మేర ఉంటుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. దాన్ని కేసీఆర్ సర్కారు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.