కరోనాతో మరణ మృదంగం: మృతులు 11 వేల మంది..

Update: 2020-03-21 08:00 GMT
ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. వేలమంది ఆ వైరస్ బారిన మృత్యువాత చెందుతుండగా.. ఆ వైరస్ దెబ్బకు లక్షల మంది సతమతమవుతున్నారు. అయితే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. ఆ కరోనా లెక్కలు చూస్తుంటే గగుర్పోడుస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలు పెరుగుతున్నాయి. ఈ కరోనా వైరస్ ప్రపంచంలోని 185 దేశాలకు పాకి ప్రస్తుతం తాండవిస్తోంది. దాదాపు 2 లక్షల 75 వేల కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదు కాగా 11వేల 385 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ కరోనా సోకిన వారిలో దాదాపు 7 వేల 479 మంది పరిస్థితి విషమంగా ఉందని అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్న లెక్కలు షాక్ కు గురి చేస్తున్నారు. అయితే ఇంత మందిలో కేవలం 90 వేల 943 మంది కరోనా నుంచి కోలుకున్నారని పలు సంస్థలు చెబుతున్నాయి.

- అయితే వైరస్ పుట్టిన దేశం చైనా. ఆ దేశం ఈ వైరస్ ధాటికి తీవ్రంగా నష్టపోగా ఇప్పుడు ఆ చైనా కన్నా ఇటలీ తీవ్రంగా ప్రభావితమవుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్యలో కూడా చైనాను ఇటలీ ఎప్పుడో దాటేసింది. ఈ దేశంలో ఒక్క రోజులోనే 627 కరోనా మరణాలు నమోదవుతుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 4 వేల32కు చేరుకోగా చైనాలో 3 వేల 248 మంది చనిపోయారు.

- స్పెయిన్, ఇరాన్ లోనూ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. స్పెయిన్ లో 1,093 మంది, ఇరాన్ లో 1,433 మంది, ఫ్రాన్స్ లో 372 మంది ఇప్పటివరకు చనిపోయారు.
- అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 218కి చేరింది.

మన దేశం భారత్ లోనూ కరోనా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 250కు చేరింది. 20 మార్చి శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 50 కొత్త కేసులు నమోదవడం చూస్తుంటే ఆ వైరస్ ఏ విధంగా విస్తరిస్తుందో గమనించవచ్చు. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కరోనాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దేశంలో మహారాష్ట్ర, కేరళలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రంలో 52 పాజిటివ్ కేసులు నమోదు కాగా కేరళలో 37 నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ తీవ్రమవుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.

భారత్ లో కరోనా కేసులు
మహారాష్ట్ర 52, కేరళ 37, ఉత్తరప్రదేశ్ 23, తెలంగాణ 19, ఢిల్లీ 17, రాజస్థాన్ 17, హర్యానా 17, కర్నాటక 15, లడఖ్ 10, గుజరాత్ 5, ఆంధ్రప్రదేశ్ 3

ఈ కరోనా నివారణకు భారతదేశ ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం ప్రజలంతా రోడ్లపైకి రాకుండా ఇంటికి పరిమితం కానున్నారు. దీంతో ఆ వైరస్ వ్యాప్తి తగ్గి పరిస్థితి అదుపులోకి వస్తుందని భారత ప్రభుత్వం భావిస్తోంది.
Tags:    

Similar News