ఏపీలో మహమ్మారి వైరస్ సామూహిక వ్యాప్తి దశలోకి వచ్చినట్టే కనిపిస్తోంది. ఎక్కడి నుంచి ఎవరికి వ్యాపిస్తుందో అంతుబట్టని విధంగా ఉంది. ఏపీలో తాజాగా కొత్తగా 138 కేసులు బయటపడ్డాయి. మొత్తం గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 9831 శాంపిల్స్ ను పరీక్షించగా.. 50 మందికి ఈ వైరస్ సోకినట్టుగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఈ కొత్త కేసుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 84మందికి.. విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురికి మహమ్మారి వైరస్ నిర్ధారణ అయినట్టుగా తెలిసింది.
తాజాగా ఏపీలో నమోదైన 138 కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 4250కి చేరాయి. 24 గంటల్లో ఈ మహమ్మారి వైరస్ తో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటిదాకా ఏపీలో ఈ వైరస్ తో మరణించిన వారి సంఖ్య 73కి చేరింది.
తాజాగా నమోదవుతున్న కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వెలుగుచూశాయి. ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
సామూహికంగా వ్యాప్తి చెందని కేసులు ఏపీలో 700 వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు. కోయంబేడు మార్కెట్ తోపాటు.. విదేశాల నుంచి వచ్చిన వారితోనే ఈ వైరస్ వ్యాపిస్తోందంటున్నారు. ఏపీలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.