కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం అల్లకల్లోలమైంది. అన్ని దేశ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో పలు దేశాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మహమ్మారి కరోనా కారణంగా స్వదేశాల్లోనే ఇరుక్కుపోవడంతో సుమారు 2 లక్షల మంది ప్రవాసులు వారి రెసిడెన్సీ పర్మిట్స్‌ను కోల్పోయినట్లు తాజాగా కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుండడంతో స్వదేశాలకు వెళ్లిన ప్రవాసులు తిరిగి కువైట్ వెళ్లలేకపోవడంతో ఏడాది కాలంలోనే రెండు లక్షల మంది ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్స్ గడువు ముగిసినట్లు తెలుస్తుంది.
గతేడాది మార్చి 10 నుంచి 2021 మార్చి 15 వరకు ఇలా 2లక్షల మంది ప్రవాసులు కువైట్ బయట ఉండిపోవడంతో రెసిడెన్సీ పర్మిట్స్‌ను కోల్పోయారు. ఈ జాబితాలో ఈజిప్ట్ కమ్యూనిటీ మొదటి స్థానంలో ఉంటే.. ఆ తర్వాతి స్థానాల్లో భారత్, శ్రీలంక ఉన్నాయి. ఇక కువైట్ బయట ఉండిపోయిన ప్రవాసులు విమానశ్రయాలు తెరచుకున్న తర్వాత ఆన్ లైన్ ద్వారా వారి రెసిడెన్సీ పర్మిట్స్ ను రెన్యువల్ చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే నివాసం గడువు ముగిసిన ప్రవాసులు తిరిగి దేశంలోకి ప్రవేశించాలంటే వారి స్పాన్సర్ లు కొత్త ఎంట్రీ వీసాలు పొందాల్సి ఉంటుందని తెలిపారు. అధికార గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం కువైట్ జనాభా 48 లక్షలు. ఇందులో విదేశీయులు 34 లక్షలు. అంటే కువైట్ జనాభాలో 70 శాతం మంది విదేశీయులే ఉన్నారు. ఇక కువైట్‌లో ఉంటున్న భారతీయు సంఖ్య 14.5 లక్షలుగా ఉంది.