ఐదేళ్ల బాలిపై గుడి ప‌రిస‌రాల్లో పూజారుల రేప్

Update: 2018-10-04 06:30 GMT
ఏం మాట్లాడాలో అర్థం కాని ప‌రిస్థితి. ఎలా స్పందించాలో తోచ‌ని దుస్థితి. ఐదేళ్ల పాప‌. అభంశుభం.. ఆ మాట‌కు వ‌స్తే.. మంచి.. చెడు అన్న విచ‌క్ష‌ణ కూడా తెలీని వ‌య‌సు. అలాంటి చిన్నారుల‌పై లైంగిక దాడికి పాల్ప‌డ‌టాన్ని ఏం చెప్పాలి?  అందులోకి ఆ దారుణ‌మైన ప‌నికి పాల్ప‌డింది ఎవ‌రో కాదు.. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పొందే పూజారులుగా ఉన్న వారే చెప్ప‌లేని దారుణానికి పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ ఉదంతంలోకి వెళితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని దాతియా జిల్లాకు చెందిన ఇద్ద‌రు పూజారులు గుడి ప‌రిస‌రాల్లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. స్థానికంగా ఒక రైతు కుమార్తెను మిఠాయి తినిపిస్తాన‌ని ఆశ చూపించి.. లైంగిక దాడికి పాల్ప‌డ్డారు.

అత్యాచారానికి గురి చేసిన త‌ర్వాత‌.. ఇంటి వ‌ద్ద దిగ‌బెట్టిన వారు.. తాము చేసిన విష‌యాన్ని ఎవ‌రికి చెప్పొద్ద‌ని చెప్పారు. బాలిక తీవ్ర నొప్పితో బాధ‌ప‌డుతుండ‌టంతో.. త‌ల్లి అడిగిన మీద‌ట జ‌రిగిన విష‌యాన్ని పాప వెల్ల‌డించింది. దీంతో చిన్నారి త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

మ‌రింత దారుణ‌మైన విష‌యం ఏమంటే.. గ‌తంలో ఈ పూజారులు ఇద్ద‌రు 12 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సున్న బాలిక‌ల‌పై ఇదే రీతిలో అత్యాచారాలు చేసి ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు.  ఇప్పుడీ ఉదంతంలో నిందితులు దోషులుగా తేలితే వారికి మ‌ర‌ణ‌శిక్ష విధించే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News