మనోళ్ల కొంప మునిగేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయా? అంటే అవునని చెప్పాలి. అమెరికాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. ఆ దేశంలో ఉండే చైనా.. భారత్ కు చెందిన అత్యధికులకు కొత్త ఇబ్బందులు ఎదురుకానున్నాయి. అమెరికాలో శాశ్విత జీవనం కోసం గ్రీన్ కార్డుల్ని జారీ చేయటం తెలిసిందే. చట్టబద్ధంగా హెచ్ 1బీ వీసా ఉన్న వారిలో చాలామంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేయటం తెలిసిందే. అయితే.. అలాంటివారి ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి కరోనా.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న రెండు లక్షల మంది తమ హెచ్ 1బీ వీసా చట్టబద్ధతను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇందులో భారత్ కు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న 2.5లక్షల మందిలో రెండు లక్షల మందికి ఈ జూన్ చివరి నాటికి తమ హెచ్1బీ వీసా చట్టబద్ధతను కోల్పోనున్న విషయాన్ని తాజాగా విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. ఇలాంటివేళ.. ఈ సమయాన్ని పొడిగించాల్సిందిగా పలువురు కోరుతున్నారు.
కరోనా కారణంగా వేలాది అమెరికన్లు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న వేళ.. అమెరికా లో హెచ్1బీ వీసాల మీద పని చేస్తున్న వారిపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. కరోనా కారణంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న అనేక కంపెనీలు.. తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ కారణంగా పలువురు తమ హెచ్1బీ వీసాల్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న అరవై రోజుల నిబంధనను 180 రోజులకు పెంచాల్సిందిగా కోరుతున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇలా కోల్పోయిన వారిలో హెచ్ 1బీ వీసాల మీద అమెరికాలో ఉన్న వారూ ఉన్నారు.
ఉద్యోగాలు కోల్పోయిన వారు.. అరవై రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే.. మరో ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగంఅంత తేలికైన వ్యవహారం కాదంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో.. వలస ఉద్యోగుల ప్రయోజనాల కంటే కూడా అమెరికన్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇబ్బంది పడే వారిలో మనోళ్లే ఎక్కువని చెప్పక తప్పదు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసల విషయంలో కఠినంగా ఉన్న ట్రంప్ సర్కారు.. తాజాగా ఉన్న గడ్డుపరిస్థితుల్లో తమ తీరుకు భిన్నంగా వ్యవహరించే అవకాశం లేదు. అందునా.. ముగింట్లో ఎన్నికల్ని పెట్టుకున్న వేళ.. వలసల విషయంలో ఏ మాత్రం సానుకూలంగా వ్యవహరించినా.. అమెరికన్ల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యం లో అమెరికాలో ఉన్న పలువురు హెచ్1బీ వీసాదారులకు..రానున్న రోజుల్లో తిప్పలు తప్పవు. ఈ విషమ పరీక్షను ఎదుర్కొనే వారిలో మనోళ్ల సంఖ్య ఎక్కువనే చెప్పాలి.