ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న అతి పెద్ద సమస్య ఈ మహమ్మారి. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పటికే కరోనావైరస్ బారిన అనేక మంది మృత్యువుతో పోరాడుతున్నారు. ఇంకా ఈ వ్యాధికి సరైన చికిత్స కూడా లేదు. మనదేశంలో మహమ్మారి కేసుల సంఖ్య రోజురోజుకి పరిగిపోతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర , తరువాత ఆ లెవెల్ లో తమిళనాడులో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఎంతగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
కాగా, ఇప్పటివరకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 17 ,728 కి చేరింది. అలాగే, ఇప్పటివరకు 127 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఇందులో 11 వేలకి పైగా పాజిటివ్ కేసులు కేవలం చెన్నై నగరంలోనే నమోదు అయ్యారు. ఆ 11 వేలమంది వైరస్ బాధితుల్లో 204 మంది గర్భిణీ స్త్రీ లు ఉన్నారు. దీనితో వైద్యనిపుణులు , అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇది నవజాత శిశువుల జీవితాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటం తో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ 204 మంది గర్భిణీల పాజిటివ్ కేసుల్లో 100 ఎగ్మోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో, 45 రాయపురం ఆర్‌ఎస్‌ఆర్‌ఎం ఆసుపత్రిలో, 30 కిల్ పాక్ ప్రభుత్వ ఆసుపత్రిలో, 29 తిరువల్లికేని లోని కాస్తుర్బాయి గాంధీ ఆసుపత్రిలో వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఇప్పటివరకు అక్కడ 9 మంది గర్భిణీ స్త్రీ లు వైరస్ భారిన పడిన తరువాత తమ బిడ్డలకి జన్మనిచ్చారు. అయితే , ఆ పిల్లల్లో వైరస్ లక్షణాలు లేవు అని వైద్యులు తెలిపారు. మరో శుభవార్త ఏమిటి అంటే తల్లి పాల నుండి కూడా ఈ వైరస్ వ్యాపించదు అని చెప్తున్నారు. అయినప్పటికీ ఆ బిడ్డలని అప్పుడే వారి దగ్గర ఉంచడం మంచిది కాదు అని, వైరస్ నెగటివ్ వచ్చిన తర్వాత వారికీ అందిస్తామని వైద్యులు చెప్తున్నారు. ఒక అధ్యయనంలో 33 మంది గర్భిణీ స్త్రీలు తమ నవజాత శిశువులలో ముగ్గురు వైరస్ బారిన పడ్డారని తేలింది. కానీ, పుట్టిన కొన్ని రోజుల తరువాత పరీక్షలు నిర్వహించినందున, గర్భం లోపల వారు వైరస్ భారిన పడ్డారా లేదా పుట్టిన తరువాత పిల్లలు సోకినా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా తల్లి నుండి బిడ్డకి వైరస్ సోకింది అని ఇంకా ఎటువంటి ఆధారం లేదు.