వ్యాపారం కోసం అమ్మాయిలను ఎరగా వేసిన ఫార్మా కంపెనీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో తాజాగా వెలుగుచూసిన రేవ్ పార్టీలో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి.
జూబ్లీ హిల్స్ లోని రోడ్ నంబర్ 10లోని ఓ పబ్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకు ఆదివారం రాత్రి వెస్ట్ జోన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో 22మంది అమ్మాయిలతోపాటు డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇంకొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ రేవ్ పార్టీ నిర్వహించింది ఓ ఫార్మా కంపెనీ అని బయటపడింది. కంపెనీ సేల్స్ పెంచుకునే క్రమంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి పార్టీ ఏర్పాటు చేశారని.. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయించారని వెల్లడైంది. పబ్ బుకింగ్ ఆ ఫార్మా కంపెనీ పేరు మీదే జరిగినట్టు విచారణలో తేలింది.
ఫార్మ కంపెనీ తమ మందులను సేల్స్ చేయడానికి, ప్రమోట్ చేసి లాభాలు గడించడానికి ఏకంగా డాక్టర్లకు అమ్మాయిలను ఏరవేశారని పోలీసుల విచారణలో తేలింది. డాక్టర్లతో గడిపేందుకు అమ్మాయిలను రప్పించింది ఫార్మా కంపెనీకి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి అని తేలింది. ఇక పోలీసుల అదుపులో ఉన్న వాళ్లంతా సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన అందమైన అమ్మాయిలని విచారణలో తేలింది.