ఓ బర్త్ డే పార్టీ 23మంది కొంప ముంచింది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ లోని అపార్ట్ మెంట్ లో చేసుకున్న పార్టీకి హాజరైన 23మందికి కరోనా సోకింది. దీంతో ఇప్పుడు ఆ అపార్ట్ మెంట్ వాసులతోపాటు పార్టీకి హాజరైన వారు లబిదిబోమంటున్నారు.
హైదరాబాద్ మదన్నపేటలో ఉన్న అపార్ట్ మెంట్ లో 23మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. ఓ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వల్లే వీరికి కరోనా సోకిందని తేలింది. దీంతో మాదన్నపేటను కంటైన్మెంట్ క్లస్టర్ గా మార్చారు. స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు ఈ వ్యవహారం దారితీసింది.
మాదన్నపేటలోని అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరి ఇంట్లో పనిచేసే పనిమనిషి(34) కు కూడా కరోనా వైరస్ సోకింది. అపార్ట్ మెంట్ లోని 50మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 23మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
అపార్ట్ మెంట్ లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిర్వహించిన బర్త్ డే పార్టీలో వీరంతా పాల్గొన్నారు. వీరిలో ఎవరి ద్వారానో అందరికీ ఈ కరోనా వైరస్ వ్యాపించింది. అపార్ట్ మెంట్ లోని మిగతా వారికి సోకింది.