తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగాలు ఎన్నో జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కానీ జరిగితే చాలు.. వలసవాదుల పాలనలో ఉన్న కష్టాలన్నీ గట్టెక్కి.. సొంత సర్కారులో సంతోషంగా బతికేస్తామన్న కలలు చాలానే కన్నారు. ఇందుకోసం ఆత్మబలిదానాలు ఇచ్చినోళ్లు వందల్లోనే ఉన్నారు. వారందరి ప్రాణ త్యాగం కానీ.. వారి ఆత్మార్పణం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మనసు మార్చేలా చేసిందని చెప్పాలి. అందుకే.. కలలో ఊహించని రీతిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.
ఏ తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దానికి పైబడి ఉద్యమం చేశారో.. తెలంగాణ రాష్ట్ర జాతిపితగా కొలిచే కేసీఆరే.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంఎలా ఉండాలని కలలు కని.. అందుకోసం ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయితే.. ప్రజల ఈతిబాధలు తెలీటమే కాదు.. తెలంగాణ ప్రజలేం కోరుకుంటున్నారన్న విషయం ఆయనకు మించి ఇంకెవరికీ తెలీదన్నట్లుగా ప్రచారం జరిగింది.
ఇంతవరకూ అంతా బాగానే ఉన్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆత్మబలిదానాలు ఆగకపోవటం ఆందోళన కలిగించేవే. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఆత్మబలిదానాల శోకం ఇంకా తీరక ముందే.. సొంత రాష్ట్రంలో.. సొంత సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు హృదయాన్ని మెలి తిప్పినట్లుగా మారి.. ప్రాణాలు తీసుకునేందుకు సైతం వెనుకాడని వైనం ఇప్పుడు గుండెల్ని పిండేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అద్భుతాలు ఆవిష్కృతం కాకున్నా.. భావోద్వేగాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా ఉంటే అదే పదివేలు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో అలా జరగని పరిస్థితి నెలకొంది.
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటిల్లో కొన్నింటిని ప్రభుత్వం ఖాతరు చేస్తే.. మరికొన్నింటిని లైట్ తీసుకున్నారు. డిమాండ్ అంటే డిమాండే. ఒక వాదనను తెర మీదకు తీసుకొచ్చే వారికి ఎంతోకొంత ఆవేదన ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటివి అర్థం చేసుకోలేరన్న కారణంగానే తెలంగాణ వాదులు వలస సర్కారును వదిలించుకొని.. సొంత సర్కారును ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మర్చిపోకూడదు.
కానీ.. అలాంటిదేమీ జరగకపోవటం ఇప్పుడు అతి పెద్ద విషాదంగా చెప్పాలి. కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన వాటిల్లో కొన్ని నిర్ణయాల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదెంత వరకూ వెళుతుందంటే.. ప్రాణాలు తీసుకునే వరకూ. శుక్రవారమే.. నల్గొండ జిల్లా పరిధిలో బలవన్మరణం ఒకటి చోటు చేసుకోవటం.. ఆ విషాదం నుంచి కోలుకోకముందే.. తాజాగా అలాంటిదే మరో దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డిలో చేర్చిన నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలంటూ ఒక యువకుడు.. ఒంటిమీద పెట్రోల్ పోసుకొని.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ పైన త్యాగరాజు విగ్రహం సమీపంలో.. అందరూ చూస్తుండగా ఆత్మార్పణం చేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది.
29 ఏళ్ల రాజు కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. స్వస్థలంపై ప్రేమాభిమానాలు విపరీతంగా ఉండే రాజుకు.. జిల్లాల పునర్విభజనలో భాగంగా నాగిరెడ్డిపేటను మెదక్ జిల్లాలో కలుపుతారని ఆశించారు. అయితే.. ముసాయిదాలో ఇందుకు భిన్నంగా కామారెడ్డిలో నాగిరెడ్డిపేటను కలపటంపై తీవ్ర నిరాశకు గురైన రాజు.. గ్రామస్తులతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నాడు. నిరసనలు.. ఆందోళనల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. అయితే.. తుది ప్రకటనలో నాగిరెడ్డిపేటను మెదక్ జిల్లాలో కలపకపోవటంతో తీవ్రమనస్తాపానికి గురై.. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొని ప్రాణ త్యాగం చేశాడు. తన ఆత్మహత్యతో అయినా సర్కారులో చలనం వస్తుందన్న ఆశతో ప్రాణత్యాగం చేశాడు. సొంతోళ్ల పాలనలోనూ ఆత్మహత్యలు చేసుకుంటే కానీ.. తాము అనుకున్నది నెరవేరదన్న భావన ఒకటైతే.. సొంతోళ్ల పాలనలోనూ తెలంగాణవాదులు తమ ప్రాణాలు తీసుకోవటంపై కేసీఆర్ స్పందనేంటి? ప్రజల మనోభావాల్ని గుర్తించటంలో ఆయన చేస్తున్న తప్పుల కారణంగా తెలంగాణవాదులు మరణించటంపై ఆయన ఏ మేరకు బాధ్యతలు తీసుకుంటారు..? ఈ ప్రశ్నలకు బదులిచ్చే వారెవరు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/