కొద్ది నెలల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పఠాన్ కోట ఇష్యూ తెలిసిందే. దేశంలోకి అక్రమంగా చొరబడ్డ ఉగ్రవాదులు.. ఒక పోలీసు అధికారి కారును ఆపి.. అతడ్ని తుపాకీతో బెదిరించి.. కారును అపహరించటం.. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి అక్రమంగా చొరబడి దాడి యత్నం చేయటం.. ఈ సందర్భంగా జరిగిన పోరాటంలో భద్రతా సిబ్బంది.. ఉగ్రవాదులు మరణించటం తెలిసిందే.
అప్పట్లో జరిగినట్లే తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకోవటం గమనార్హం. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఒక వ్యక్తి కారులో వస్తుంటే.. ముగ్గురు వ్యక్తులు లిఫ్ట్ కోసం కారు అడగటం.. అతను ఆపినంతనే తుపాకీలు గురి పెట్టి కారును తీసుకెళ్లిపోవటంతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడుతున్నారు. దుండగులు ఎత్తుకెళ్లిన కారు ఏమైంది? ఎవరు తీసుకెళ్లారు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో మాదిరి ఈసారి కారు అపహరించిన ఘటన ఉగ్రవాదులకు సంబంధం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎత్తుకెళ్లిన కారు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.