షాకింగ్: లోయలోకి బస్సు..31మంది మృతి

Update: 2019-07-01 05:49 GMT
జమ్మూ కశ్మీర్.. మొత్తం హిమాలయా పర్వత శ్రేణులతో నిండిన రాష్ట్రం. భారతదేశానికి స్విట్లర్లాండ్ లా పేరొందింది. ఆకాశాన్ని అంటే హిమాలయ పర్వతాలు, మంచుతో కప్పబడి ఆహ్లాదకరంగా ఉంటుంది. పాకిస్తానీ ఉగ్రవాదుల బెడద లేకుంటే ప్రపంచంలోనే గొప్ప టూరిస్ట్ స్పాట్ గా నిలిచి ఉండేది. అయితే ఇక్కడ కొండలు, గుట్టలతో ప్రయాణాలు ఎప్పుడూ ప్రమాదమే..

తాజాగా కశ్మీర్ లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. 31మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు భారీ లోయలోపడింది. ఈ ప్రమాదంలో తొలుత స్పాట్ లోనే 25 మంది చనిపోగా.. చికిత్స పొందుతూ తాజాగా ఆరుగురు చనిపోయారు. మొత్తం 31మందికి మృతుల సంఖ్య చేరింది.

కశ్మీర్ లోని కేశ్వాన్ నుంచి కిష్త్వార్ వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు  మార్గ మధ్యలో కొండపైనుంచి వెళుతుండగా అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 31మంది చనిపోగా.. 13 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. మొత్తం బస్సులో 45మంది ప్రయాణికులు ఉన్నట్టు కశ్మీర్ పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా దేశంలో వరుస బస్సు ప్రమాదాలు.. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతుండడం విషాదం మారింది.


Tags:    

Similar News