ప్రపంచవ్యాప్తంగా భారతీయుల సంఖ్య ఎంతో తెలుసా?

Update: 2022-03-30 00:30 GMT
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా అంతటా భారతీయులు ఉండనే ఉంటారు. ప్రపంచంలోని 210 దేశాల్లో భారతీయులు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. అంటే దాదాపు ఒకటి ఆరా దేశాలు తప్పితే అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా ప్రవాస భారతీయులు ఉన్న దేశం ఏంటో తెలుసా? ‘యూఏఈ’. భారతీయులకు ఈ గల్ఫ్ దేశం మరో ఇల్లులా మారిందంటే అతిశయోక్తి కాదు.

ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో 1.34 కోట్ల మంది ఎన్నారైలు, 1.86 కోట్ల మంది పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ లు ఉన్నారని కేంద్రప్రభుత్వం తెలిపింది.  మొత్తంగా 3.21 కోట్ల మంది ఉన్నట్లు లోక్ సభలో కేంద్రమంత్రి మురళీధరన్ వెల్లడించారు. వీరిలో ఆరు గల్ఫ్ దేశాల్లో కలిపి అత్యధికంగా 88,88,733 మంది ఎన్నారైలు ఉన్నారని తెలిపారు.

ఇక యూఏఈలో 34,19,875, అమెరికాలో 27 లక్షల మంది.., సౌదీలో 25,92,166, కువైట్ లో 10,28,274, ఒమన్ లో 7,79,351, ఖతార్ లో 7,45,775, బహ్రెయిన్ లో 3,23,292 మంది ఉన్నారు.

యూఏఈ తర్వాత ప్రవాస భారతీయులు అత్యధికంగా ఉన్నది అగ్రరాజ్యం అమెరికాలోనే.  అమెరికాలో ఏకంగా 2.7 మిలియన్ల మంది భారతీయులున్నారు. ఇక ఆ తర్వాత సౌదీ అరేబియాలో 2.5 మిలియన్ల మంది ఉన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం రెండో స్తానంలో ఉంది. మనకంటే ముందు చైనా ఉంది.  భారత్ నుంచి ఏకంగా దాదాపు 18 మిలియన్ల మంది విదేశాలకు వలస వెళ్లారు. నిజానికి ఇది చాలా పెద్ద సంఖ్య. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు.
Tags:    

Similar News