గుజరాత్ కు చెందిన జనార్దన్ శర్మా దంపతులు తమ కుమార్తెలను నిత్యానంద, ఆయన శిష్యులు నిర్బంధించారని, వాళ్లతో మాట్లాడటానికి, కలవడానికి మాకు అవకాశం ఇవ్వకుండా చేశారని ఆరోపిస్తూ గుజరాత్ హై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ కుమార్తెలతో పాటు నిత్యానంద ఆశ్రమంలో అక్రమంగా బంధీలుగా ఉన్న అమ్మాయిలను రక్షించాలని కోరారు. దీనితో ఇటీవలే ఇటీవల జనార్దన్ శర్మా దంపతుల కుమార్తెలు ఉన్న ప్రాంతానికి పోలీసులు వెళ్లారు.
అక్కడ ప్లాట్ లో ఉన్న ఇద్దరు మైనర్ బాలికను పోలీసులు రక్షించారు. ఇదే సమయంలో జనార్దన్ శర్మా దంపతులతో వెళ్లడానికి వారి ఇద్దరు పెద్ద కుమార్తెలు నిరాకరించడంతో పోలీసులు చేతులు ఎత్తేశారు. మేము నిత్యానంద ఆశ్రమంలోనే ఉంటామని, మా తల్లిదండ్రులతో వెళ్లమని జనార్దన్ శర్మా కుమార్తెలు చెప్పారని పోలీసులు తెలిపారు. గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో నిత్యానందకు చెందిన యోగిణి సర్వజ్ఞపీఠం ఆశ్రమం ఉంది. యోగిణి సర్వజ్ఞపీఠం ఆశ్రమం నిర్వహణ భాద్యతలను సాద్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధి కిరణ్ అనే ఇద్దరు మహిళలు చూసుకుంటున్నారు.
ఇదే ఆశ్రమంలో నిత్యానంద శిష్యులు అయిన సాద్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధి కిరణ్ అనే ఇద్దరు మహిళలను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. నిత్యానందకు చెందిన ప్లాట్ లోని నలుగురు అమ్మాయిలను గుజరాత్ పోలీసులు రక్షించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అమ్మాయిలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు అన్నారు. ప్లాట్ లో అమ్మాయిలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ నిత్యానంద శిష్యులైన సాద్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధి కిరణ్ అనే ఇద్దరు మహిళలను అరెస్టు చేసారు. బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలోని నిత్యానంద ఆశ్రమంలో ఉంటున్న వారిని విచారణ చేసి వివరాలు సేకరించడానికి గుజరాత్ పోలీసులు సిద్దం అయ్యారని తెలిసింది. త్వరలోనే బిడిది ఆశ్రమంలో విచారణ చెయ్యడానికి గుజరాత్ పోలీసులు సిద్దం అయ్యారని సమాచారం నిత్యానంద, ఆయన శిష్యుల మీద ఇప్పటికే అనేక ఆరోపణలు రావడం, కేసు నమోదు కావడంతో కోర్టులో విచారణ జరుగుతోంది