ఏపీ ప్ర‌జ‌ల ఓటు జ‌గ‌న్ కే..తేల్చిన తాజా స‌ర్వే!

Update: 2018-09-15 05:33 GMT
ఏపీ ప్ర‌జ‌లు ఇప్పుడు ఎవ‌రి వైపు ఉన్నారు? అధికార‌.. విప‌క్ష నేత‌ల విష‌యంలో ఏపీ ప్ర‌జ‌లు ఎలా ఆలోచిస్తున్నారు? మ‌రికొద్ది నెల‌ల్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న అంశంపై ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియాటుడే=యాక్సిస్ మై ఇండియా తాజాగా ఒక స‌ర్వేను నిర్వ‌హించింది.

శాస్త్రీయంగా జ‌రిపిన ఈ స‌ర్వేను సెప్టెంబ‌రు 8 నుంచి 12 మ‌ధ్య‌న నిర్వ‌హించారు. దాదాపు 10,650 మంది శాంపిల్ ను ప్రాతిప‌దిక‌న తీసుకొని విశ్లేషించిన స‌ర్వే ఫ‌లితాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. బాబు స‌ర్కారుపై ఏపీ ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న వ్య‌తిరేక‌త ఎంత తీవ్రంగా ఉంద‌న్న‌ది తాజా స‌ర్వే ఫ‌లితం స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

తాజా స‌ర్వే ఫ‌లితాల్ని చూస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ చేతికి అధికారాన్ని అప్ప‌జెప్పేందుకు ఏపీ ప్ర‌జ‌లు తాజాగా సిద్ధంగా ఉన్న‌ట్లుగా వెల్ల‌డించింది. అధికార మార్పిడి త‌థ్య‌మ‌ని తేల్చ‌ట‌మే కాదు.. సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి 43 శాతం మంది సానుకూలంగా ఓటు వేయ‌టం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో.. చంద్ర‌బాబుకు 38 శాతం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు 5 శాతం మంది మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లుగా స‌ర్వే ఫ‌లితాన్ని వెల్ల‌డించారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ రాష్ట్ర విప‌క్ష నేత‌కు రాన‌న్ని ఓట్లు జ‌గ‌న్ కు వ‌చ్చిన‌ట్లుగా వెల్ల‌డించారు.  ఏ రాష్ట్రంలోనూ ఆయా ముఖ్య‌మంత్రి కంటే ఎక్కువ‌గా ఓట్లు విప‌క్ష నేత‌కు వ‌చ్చింది లేదు. ఒక్క ఏపీ విష‌యంలోనే అలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డ‌టం విశేషంగా చెప్పాలి.

ఇండియా టుడే ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సర్వేలో.. మూడు ముఖ్య‌మైన అంశాల్ని సూటిగా ప్ర‌శ్నించారు. అందులో ఒక‌టి ఏపీలో త‌దుప‌రి సీఎం ఎవ‌రు? అన్న సూటి ప్ర‌శ్న‌కు ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు ఓటేశారు. బాబు స‌ర్కారు ప‌ని తీరు బాగోలేదంటూ 36 శాతానికే ప‌రిమితం కాగా.. జ‌గ‌న్ కు మాత్రం 43 శాతం మంది ఓటేయ‌టం గ‌మ‌నార్హం.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ని తీరు ఎలా ఉంద‌న్న ప్ర‌శ్న‌కు 36 శాతం మంది బాగోలేద‌ని పెద‌వి విర‌వ‌గా.. ఫ‌ర్లేద‌ని  18 శాతం మంది చెప్ప‌గా.. బాగుంద‌ని కేవ‌లం 33 శాతం మంది మాత్ర‌మే చెప్పారు. ఇక‌..ఏపీలో ఓటుపై ప్ర‌భావం చూపించే అంశాలు ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే.. పారిశుధ్యం 63 శాతం.. వ్య‌వ‌సాయం 51%.నిరుద్యోగం 25%.. ధ‌ర‌ల పెరుగుద‌ల 23%.. తాగునీరు 21% ప్ర‌భావం చూపుతుంద‌ని వెల్ల‌డించారు. .  


Tags:    

Similar News