బ్రేకింగ్: ఏపీలో మరో 56 కరోనా కేసులు !

Update: 2020-04-22 08:30 GMT
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది.  గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో  56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం కర్నూలు - గుంటూరు నుంచే ఉన్నాయి. గుంటూరులో 19 - కడపలో 5 - క్రిష్ణాలో 3 - కర్నూలు లో 19 - ప్రకాశంలో 4  - చిత్తూరులో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 813కు చేరింది. వీరిలో 120 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్‌ కాగా - 24 మంది కరోనా  కు బలయ్యారు. ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారు.

కర్నూలుజిల్లాలో అత్యధికంగా 203 కరోనా కేసులు నమోదు కాగా - వారిలో 194 మందికి ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ఇప్పటివరకు 5 మంది మృతి చెందగా - నలుగురు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలు తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 177 కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు తెలిపింది. గుంటూరులో 146 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా - 23 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇక మరణాల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. తాజా మరణాలతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 24కు చేరింది. ఇక తెలంగాణ విషయానికొస్తే ..ఇప్పటివరకు 928 మంది కరోనా భారిన పడగా.. 23 మంది మృతిచెందారు.  ఇక భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 20వేలకు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 640 కు చేరింది. 
Tags:    

Similar News