కొద్దిరోజుల కిందటి వరకు రోజుకు 10వేల చొప్పున కేసులు నమోదైన ఏపీలో తాజాగా కరోనా తీవ్రత తగ్గడం ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో కరోనా కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. డిశ్చార్జీలు పెరుగుతున్నాయి. గతంతో పోలీస్తే ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది.
తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 6555 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 70399 టెస్టులు చేయగా దాదాపు 6వేల దాకా కేసులు వెలుగుచూశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 706790కు పెరిగాయి.
ఇక కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య మళ్లీ భారీగా తగ్గిపోయాయి. శుక్రవారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య 31గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5900కు పెరిగింది.
కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 643993 మంది డిశ్చార్జ్ అవ్వగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 56897 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 5948534 పరీక్షలు నిర్వహించారు.
కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో కృష్ణ జిల్లాలో ఆరుగురు, అనంతపురం, తూర్పు గోదావరిలో నలుగురు, చిత్తూరు, కర్నూలు, విశాఖలో ముగ్గురు, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున మరణించారు.
ఇక ఏపీలో అత్యధికంగా తూర్పు గోదావరిలో 975 కేసులు పశ్చిమ గోదావరిలో 930 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో కరోనా తీవ్రంగా ఉంది.