అక్కడ అమ్మాయిలను ఎత్తుకెళ్లిపోతున్నారు

Update: 2015-07-06 08:56 GMT
ముంబయి మహానగరం భిన్న జాతులు, భిన్న సంస్కృతులకు నిలయం.. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పే ముంబయి డ్రగ్స్‌, మాఫియా, కిల్లర్‌ గ్యాంగులు, వ్యభిచార ముఠాలు... ఒకటేమిటి ఎన్నో వికృత పార్శ్వాలకు కేంద్రం. అలాంటి ముంబయి నగరంలో అమ్మాయిలకు ఏమాత్రం రక్షణ లేదు. అక్కడి పోలీసు శాఖ విడుదల చేసిన గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    ముంబయిలో నెలకు 884 మంది అదృశ్యమవుతున్నారట. వీరిలో మైనర్‌ బాలికల సంఖ్యే ఎక్కువ. అందులోనూ కనిపించకుండా పోయినవారి కంటే అపహరణకు గురయినవారి సంఖ్యే ఎక్కువట. నెలకు 884 మంది అదృశ్యమవుతున్నారంటే ఏడాదికి 10 వేల మంది కంటే ఎక్కువమంది మిస్సవుతున్నట్లు లెక్క. 2005 నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,10,547 మంది ఇలా కనిపించకుండా పోయారట. వీరిలో లక్ష మంది ఆచూకీ తెలిసినా ఇంకా పది వేల మంది జాడ మాత్రం తెలియలేదు. వీరిలో చాలామంది మృతి చెంది ఉంటారని.... ఇతర నగరాలు, దేశాల్లోని వ్యభిచార గృహాల్లోనూ చాలామంది ఉండిఉండొచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

    ఈ ఏడాది ఇంతవరకు 582 మంది బాలికలు, 2944 మంది మహిళలు కనిపించకపోగా వారిలో ఒక్కరు కూడా ఇంతవరకు దొరకలేదట. ఇలా మిస్సవుతున్నవారిలో ఎక్కువ మంది మురికివాడలకు చెందినవారే ఉంటున్నారు. అయితే... సోషల్‌ మీడియా విస్తృతమయ్యాక మిస్సయినవారిని ట్రేస్‌ చేయడం కూడా కొంత సులభమవుతోందట.
Tags:    

Similar News