బ్రతికుండగానే పసిబిడ్డను గుంతలో పాతిపెట్టేశారు .. ఎక్కడ జరిగిందంటే ?

Update: 2020-08-10 13:53 GMT
జార్ఖండ్‌లోని లోహర్‌ ద‌గా జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బతికి ఉండగానే శిశువును పాతిపెట్టిన విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే , ఆ బిడ్డ చనిపోయింది అని అక్కడ పాతిపెట్టారా ?లేక ఆ బిడ్డను వదిలించుకోవడానికి పాతిపెట్టారా అనే విషయం ఇంకా వెల్లడికాలేదు. కానీ , ఈ ఘటన పై స్థానికుల్లో కలకలం రేగింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..

కుడు పోలీసు స్టేషన్ ప్రాంతంలోని చంద్లాసో గ్రామంలో శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఓ శ్మశానం నుంచి ఓ మహిళకు శిశువు ఏడుపు వినిపించింది. మొదట్లో ఆ ఏడుపు విని ఆమె భయపడింది. దానికి కారణం అది శ్మశానం. కానీ బిడ్డ ఏడుపు విని ఎక్కువ సేపు ఆగలేకపోయింది. ఓపక్క భయం..మరో పక్క బిడ్డ ఏడుపు వినటంతో నా కెందుకులే అని ఊరుకోలేపోయింది. వెంటనే ఊరి ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో స్థానికులంతా అక్క‌డికి చేరుకుని, భూమిలో పాతిపెట్టిన ఆ శిశువును వెలికితీశారు. ఆ శిశువు ప్రాణాలతో క్షేమంగానే ఉండ‌టంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాలతో బయటపడిని ఈ చిన్నారికి గ్రామానికి చెందిన ప‌లువురు త‌ల్లులు ఆహారం అందించారు. అలాగే, ఆ శిశువును ద‌త్త‌త తీసుకునేందుకు పోటీప‌డ్డారు. జరిగిన విషయాన్ని పోలీసుల‌కు స‌మాచారం అందించారు గ్రామస్తులు. దీంతోపోలీసులు గ్రామానికి చేరుకుని, ఆ శిశువును ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఆ బిడ్డ ఎవరు.. తల్లిదండ్రులు ఎవరు .. బతికి ఉండగానే పాతిపెట్టారా? లేదా చనిపోయిందనుకుని పాతి పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.
Tags:    

Similar News