వైరస్ సోకడంతో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

Update: 2020-06-24 13:30 GMT
వైరస్ సోకడంతో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో  వైరస్ దెబ్బకు ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, అధికారులు, ముఖ్యంగా పోలీసులు వణికిపోతున్నారు. బెంగళూరు సిటీలో 484 డేంజర్ జోన్లు గుర్తించిన అధికారులు ఆ ప్రాంతాలు పూర్తిగా సీల్ డౌన్ చేశారు. బెంగళూరు సిటీలో రోజురోజు  పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో BBMP అధికారులు అనేక చర్యలు తీసుకుని కరోనా వైరస్ కట్టడి చెయ్యాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

బెంగుళూరు లో ఓ కానిస్టేబుల్  వైరస్ వచ్చిందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర రిజర్వ్ పోలీస్ విభాగానికి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ కు వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో అతడిని బెంగళూరులోని సీవీ రామన్ ఆసుపత్రికి తరలించాలని అధికారులు నిర్ణయించారు.అతడిని తరలించడానికి  ఓ ప్రత్యేక మినీ బస్సు ఏర్పాటు చేశారు. కానీ ఆ మినీ బస్సులోనే గమ్యానికి చేరేలోపే ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆస్పత్రి చేరుకున్న తరవాత డ్రైవర్ బస్సు డోర్ ఓపెన్ చేసి చూడగా బస్సు గ్రిల్ కు అతడి లుంగీతో ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. కరోనా పాజిటివ్ గా వచ్చిందన్న భయంతోనే ఆ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం చెందినట్టు భావిస్తున్నారు. కాగా బెంగళూరు సిటీలోని వివిధ ప్రాంతాల్లో వైరస్ సోకిన వారి సంఖ్య 1, 405కు చేరుకుందని అధికారులు అంటున్నారు. బెంగళూరులో 965 వైరస్  ఆక్టిక్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే   వైరస్ వ్యాధితో 378 మంది కోలుకున్నారు. బెంగళూరు సిటీలో వైరస్ కాటుకు ఇప్పటి వరకు 65 మంది మరణించారని అధికారికంగా ప్రభుత్వం వెళ్లడించింది.
Tags:    

Similar News