సీఐడీ కస్టడీకి పోసాని.. మంగళవారం కృష్ణమురళికి బిగ్ డే!
ఈ కేసులోనే పోసాని కృష్ణమురళి ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు. ఈ కేసులోనూ బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై మంగళవారం కోర్టు విచారణ చేపట్టనుంది;
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లతో పాటు వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్య్యాఖ్యలు చేశారని.. సినీరంగంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోసాని కృష్ణమురళిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే!
ఈ క్రమంలో ఆయనపై పలు ఫిర్యాదుల ఆధారంగా సుమారు 17 కేసులు నమోదయ్యాయి! అయితే.. వీటిలో కొన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ తెచ్చుకున్న పోసాని.. హైకోర్టు ఉత్తర్వ్యులతో మరికొన్ని కేసుల్లో అరెస్టు నుంచి మినహాయింపు పొందారు! సరిగ్గా ఈ సమయంలో సీఐడీ ఎంట్రీ ఇచ్చి.. వారు నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేసింది.
ఈ కేసులోనే పోసాని కృష్ణమురళి ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు. ఈ కేసులోనూ బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై మంగళవారం కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే.. బెయిల్ విచారణ జరుగుతున్న రోజే పోసానిని అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు కోర్టు సీఐడీకి అనుమతి ఇచ్చింది.
అవును... ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి తాజాగా మరో షాక్ తగిలింది. ఇప్పటికే గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని పోలీసు కస్టడీకి అనుమతించింది కోర్టు. పోసానిని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిని కోర్టు.. ఈ మేరకు అనుమతి ఇచ్చింది.
ఇందులో భాగంగా... పోసాని కృష్ణమురళిని ఒక్క రోజు విచారించేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. దీంతో... మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోసానిని సీఐడీ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది! అదే రోజు బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచరణ జరగనుంది.