టీడీపీ 2019లో ఓటమికి కారణం ఆయనేనట !
అంతే కాదు చంద్రబాబు కూడా అనేక సందర్భాలలో మంచి పాలన అందించి కూడా తాము ఓటమి పాలు అయ్యామని చెప్పుకున్నారు.;
నీవు ఎందుకు ఓడిపోయావు బాబూ అని 2019లో ఓటమి తరువాత టీడీపీ అధినేత ఉన్న ఉండవల్లి నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో మహిళలు అంతా క్యూ కట్టి మరీ ఏడ్చేసిన సంఘటనలు ఆ వీడియోలు అందరికీ గుర్తు ఉండే ఉంటాయి. అంతే కాదు చంద్రబాబు కూడా అనేక సందర్భాలలో మంచి పాలన అందించి కూడా తాము ఓటమి పాలు అయ్యామని చెప్పుకున్నారు.
పైగా ఎందుకు ఓటమి చెందామో అర్ధం కావడం లేదని కూడా అన్నారు. మంచి పాలన ఇచ్చే ఆవు లాంటి టీడీపీని కాదని కొమ్ములతో పొడిచే దున్నపోతు లాంటి వైసీపీని ఎన్నుకున్నారని ప్రజల మీద నిష్టూరాలు వేశారు. ఏపీ ప్రజల తీర్పు అన్నట్లుగా టీడీపీ నేతలు అనేక మంది అప్పట్లో కామెంట్స్ చేస్తూ వచ్చారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇంతకీ టీడీపీ ఎందుకు ఓటమి పాలు అయింది అంటే ఏ పార్టీకి చెందని వారికి తెలుసు. రాజకీయ విశ్లేషకులకు తెలుసు. అన్నింటి కంటే ఓట్లేసి వైసీపీని 151 సీట్లతో గెలిపించిన జనాలకు కూడా తెలుసు.
కానీ తెలియాల్సిన వారికి తెలియలేదా అంటే తెలుసు కానీ రాజకీయాల్లో లౌక్యం మర్మాలు ఉంటాయి. అందుకే ఎవరూ బయటకు చెప్పలేరు. కానీ ఇపుడు చెప్పడానికి అవకాశం ఉంది. పైగా 164 సీట్లతో అధికారంలోకి టీడీపీ వచ్చింది.
అందుకే 2019లో ఎందుకు ఓటమి పాలు అయ్యామో చంద్రబాబు నిండు సభలో చెప్పుకొచ్చారు. అంతే కాదు 2004లో తొలిసారి ఓటమి ఎలా ఎదురైందో ఆ ముచ్చట కూడా చెప్పారు. అసెంబ్లీలో బాబు టీడీపీ ఓటమికి ఎవరో కారణం కాదు తానే అని బోల్డ్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు.
తనను ఎవరూ ఓడించలేదని ఆయన చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఓటముల వెనక తానే ఉన్నాను అని చెప్పుకొచ్చారు. తాను అధికారంలో ఉన్నపుడు కొన్ని పనులు చేయలేకపోవడం వల్లనే ఓటమి పాలు అయ్యాను అని అన్నారు. అంతే కాదు ప్రభుత్వ పనులలో పడి పార్టీని అలాగే ఎమ్మెల్యేలను కో ఆర్డినేట్ చేసుకోలేమపోయామని కూడా అంగీకరించారు. అలా టీడీపీ ఓటమికి తాను కారణం అని బాబు ఒప్పుకున్నారు.
ఏ ప్రభుత్వం అయినా ప్రజా సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తే ఓటమి అన్నదే ఉండదని ఆయన చెబుతూ కూటమి ఎమ్మెల్యేలను ఆ దిశగా దిశా నిర్దేశం చేశారు. మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీని నాడు 2004లో వైఎస్సార్ కానీ 2019లో జగన్ కానీ ఓడించలేదని కూడా బాబు చెప్పినట్లు అయింది. పార్టీని ప్రభుత్వాన్ని కో ఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల సమస్యలు తీరిస్తే ఎప్పటికీ టీడీపీకే అధికారం అన్నది బాబు మాటలలో వ్యక్తం అయింది.
మరి నాలుగు సార్లు సీఎం గా ఉన్నారు. యాభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. దాంతో బాబు మళ్ళీ మళ్ళీ టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారు. దాంతో ఆయన ఎమ్మెల్యేలను పార్టీని ఇప్పటి నుంచే ఆ దిశగా సమాయత్త పరుస్తున్నారు.